కోస్తా జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక
* రేపు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది
* తూర్పుగోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
* సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడతాయి.
* అలలు 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసి పడే అవకాశం
* గాలులు గంటలకు 50 కిలో మీటర్ల వేగంతో వీచే సూచనలు
* మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు
* ప్రజలు కూడా సముద్రం తీరం చెంతకు వెళ్లకుండా ఉండాలి
ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణాజిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించిన ఇన్చార్జి కలెక్టర్ విజయ్ కృష్ణ.
విశాఖ లో ఈ హెచ్చరిక ప్రభావం కనిపిస్తూ ఉంది. అక్కడ భారీగా వర్షం కరుస్తుంది. ఎన్ హెచ్ 5 మీది పరిస్థితి ఇది.