క్షుద్ర విద్యలు నేర్పిన గురువుని బలి ఇచ్చిన శిష్యుడు.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా..?

ఒకప్పటి రోజులకీ ఇప్పటి రోజులు ఎంతగానో మారాయి. శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతో అభివృద్ధి చెందిన ఈ కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ ఉంటుంది. అయితే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత కూడా అనేక మంది మునుపటి తరాల వారి లాగా మూడ నమ్మకాలను గుడ్డిగా పాటిస్తున్నారు. క్షుద్ర పూజలు చేస్తే వారికి శక్తులు వస్తాయని, ఇతరులకు నష్టం కలిగే విధంగా కూడా పూజలు చేస్తుంటారు. ఇలాంటి ఘటన ఒకటి ఛత్తీస్ ఘడ్ లో చోటుచేసుకుంది. ఒక వ్యక్తి తనకు క్షుద్ర శక్తులు వస్తాయి అని, విద్య నేర్పిన గురువునే చంపేశాడు. అనంతరం అతడి రక్తాన్ని తాగాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు…. ఛత్తీస్ ఘడ్ లోని దంతర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన 25 సంవత్సరాల వయసు గల మాన్య చావ్లా అనే వ్యక్తి క్షుద్ర విద్యలు నేర్చుకొని గొప్పవాడు కావాలి అనుకునేవాడు. ఇందుకోసం క్షుద్ర విద్యలో సిద్ధహస్తుడు అయిన 50 సంవత్సరాల బసంత్ సాహో అనే వ్యక్తి దగ్గర శిష్యుడి గా చేరాడు. సాహు తనకు తెలిసిన విద్యని తన శిష్యుడికి నేర్పుతూ వచ్చాడు. ఈ క్రమంలోనే మనుషుల్ని బలి ఇస్తే అద్భుతమైన శక్తులు వస్తాయి అని శిష్యుడికి చెప్పాడు. ఎవరినో బలి ఇవ్వడం కన్నా తన గురువు ని బలి ఇస్తే అతనికి ఉన్న శక్తులు వస్తాయి అని భావించాడు మన్య. తన గురువు ని చంపి అతని రక్తం తాగితే గురువు శక్తులు అన్ని పొందవచ్చు అని భావించాడు.

ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించాడు. ఒక రోజు రాత్రి తన గురువు పూజలో ఉండగా కత్తి తో దాడి చేశాడు. ఆయన రక్తాన్ని సేవించాడు. అనంతరం శవాన్ని కాల్చేశాడు. ఈ శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులకు మన్య మీద అనుమానం కలగడం తో వారి స్టైల్ లో విచారణ చేయడం తో నిజం బయటకి వచ్చింది. క్షుద్ర విద్యల కోసమే తన గురువుని చంపినట్టు విచారణలో ఒప్పుకున్నాడు.