హైదరాబాద్ లో క్రాస్ మసాజ్, 20 మంది అరెస్టు (వీడియోలు)

హైదరాబాద్ బ్రేకింగ్ న్యూస్… మసాజ్ సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. వెస్ట్ జోన్ పరిధిలోని 10 మస్సాజ్ సెంటర్ల పై సోమవారం సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు చేశారు. 

బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా క్రాస్ మస్సాజ్ చేస్తున్న 20 మంది నిర్వాహకులు, కస్టమర్లను అరెస్ట్ చేశారు.

క్రాస్ మసాజ్ పై హైదరాబాద్ లో నిషేధం విధించినప్పటికీ చాటుమాటుగా క్రాస్ మసాజ్ చేయిస్తున్నారు. దీంతో పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి పలువురిని అరెస్టు చేశారు.

వీడియోలు కింద ఉన్నాయి చూడండి.