ఐఆర్ ఎస్ అధికారి కోటేశ్వరమ్మ విజయవాడ కనకదుర్గ గుడికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వచ్చి పట్టమని రెన్నెళ్లు దా టలేదు అపుడే వివాదాలలో ఇరుక్కుంటున్నారు. ఆమెకు ఛెయర్మన్ గౌరంగ్ బాబు కు ఇపుడు పచ్చగడ్డి వేసినా భగ్గున మండుతున్నది. పాలకమండలి ఆమెకు ఎదురుతిరగడంతో ఇంద్రకీలాద్రి పండగపూట రచ్చరచ్చ అవుతున్నది.
పాలకమండలిని విస్మరిస్తున్నదని ఇవొ కోటేశ్వరమ్మ మీద ఫిర్యాదుచేయాలని పాలకమండలి సభ్యలు ప్రకటించారు.
ఇఓ కోటేశ్వరమ్మ పై సిఎంకు ఫిర్యాదు చేయనున్న పాలకమండలి
ఇఓ తమను నిత్యం అవమానిస్తోందంటూ పాలకమండలి సభ్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. దీనితో
చైర్మన్ గౌరంగబాబు కొద్ది సేపటి కిందట తన చాంబర్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించార. అంతా చెయిదాటిపోతున్నదన్న ఆవేదన వ్యక్తం చేశారు.
దుర్గగుడి చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు కామెంట్స్ ఇవి:
దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలని చూస్తుంటే ఈవో మాకు సహకరించడం లేదు
చైర్మన్ ను, పాలకమండలి సభ్యులను చిన్న ఆమె చూపు చూస్తున్నారు
దర్శనానికి వెల్తున్న మా కుటుంబ సభ్యులను కూడా అడ్డుకుంటున్నారు, లోనికి అనుమతించడం లేదు. (రెండు రోజుల కిందట కిందట ఛెయిర్మన్ లోనికి వెళ్లకుండా పోలీసులుఅడ్డుకున్న సంగతి తెలిసిందే.)
చివరికి ఎమ్మెల్యే బొండా ఉమను కూడా ఈ రోజు అవమానించారు.
మాకు జరుగుతున్న అవమానాలపై ఈవోను నిలదీస్తాం
దుర్గగుడి పై వరుస వివాదాల వల్ల అమ్మవారి ప్రతిష్ట దిగజారుతోంది
ఈవో కోటేశ్వరమ్మ తన
వైఖరి మార్చుకొవాలి
ఈవో తన ప్రవర్తన మార్చుకోకపోతే సిఎంకు ఫిర్యాదు చేస్తాం