ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన యువకుడు

ఆరేళ్ల చిన్నారి పై అత్యాచారం చేసి అతి దారుణంగా హత్య చేశాడో కిరాతకుడు. అల్వాల్ లో ఆరేళ్ల చిన్నారి ప్రవలిక ఆమె సోదరునితో కలిసి హోళీ రోజు ఆడుకుంటుంది. వారి ఇంటి పక్కకు ఉండే ధర్మేంద్రకుమార్ అనే బీహార్ యువకుని ఇంటికి వారి ఫ్రెండ్స్ వచ్చారు. అందులో రాజేష్ అనే 20 ఏండ్ల యువకుడు అప్పటికే ఫుల్ తాగి ఉన్నాడు. ప్రవలిక సోదరునికి రంగులు ఇప్పించి మభ్యపెట్టి ప్రవలికను తన వెంట తీసుకెళ్లాడు.

దగ్గర్లోని రైల్వే కట్ట దగ్గర చెట్లలో చిన్నారి పై అత్యాచారం చేశాడు. చిన్నారి భయంతో ఏడుస్తుండగా మెడ పై ఇనుప రాడ్డుతో కోశాడు. దీంతో రక్తస్రావంతో చిన్నారి అక్కడే చనిపోయింది. చిన్నారి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి విచారించగా అసలు దారుణం బయటపడింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పై దారుణం జరగడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి. నిందితుడిని ఉరి తీయాలంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.