నెత్తురోడిన రహదారులు.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రాణ స్నేహితులు?

దేశంలో ప్రతిరోజు కొన్ని వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబంలో తీరని లోటు మిగులుస్తున్నారు. ఇటీవల జైపూర్ విశాఖపట్నం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

వివరాలలోకి వెళితే…విజయనగరం రూరల్‌ మండలం ధర్మపురి గ్రామానికి చెందిన మామిడి ఈశ్వరరావు (45), డెంకాడ మండలం జొన్నాడ గ్రామానికి చెందిన సారికి కామునాయుడు (47) ప్రాణ స్నేహితులు స్నేహితులు. కామ నాయుడు వ్యవసాయ కూలీ పనులు చేస్తూ భార్య పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. ఈశ్వర రావు విజయనగరంలో ఉన్న ఒక హోటల్లో కుక్ గా పని చేస్తు భార్య ఇద్దరు కుమారులతో కలిసి జీవిస్తున్నాడు. మంగళవారం నాడు కామునాయుడు ఈశ్వర రావు కలుసుకొని ఇద్దరు ద్విచక్ర వాహనం మీద అయినాడ జంక్షన్ నుండి జొన్నాడ వైపు వెళ్తున్నారు.

ఈ క్రమంలో మీరు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి జాతీయ రహదారిపై ఉన్న డివైడర్ ని ఢీకొట్టారు. ద్విచక్ర వాహనం వేగంగా వెళుతూ డివైడర్ ని ఢీకొట్టడంతో దాదాపు 50 మీటర్లకు పైగా రోడ్డుపై ద్విచక్ర వాహనం వీరిని ఈడ్చుకుంటూ వెళ్లింది దీంతో ఇద్దరికీ తలకు తీవ్రగాయాల అయ్యి రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వీరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.