వాజ్‌పేయితో ఒక సందర్భాన్ని గుర్తు చేసుకున్న బాలకృష్ణ

మా ‘బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్’ను జూన్ 22, 2000 సంవత్సరంలో ఇనాగ్యురేట్ చేసిన మహానుభావుడు వాజపేయి గారు. నాన్నగారితో ఆయనకి మంచి అనుబంధం ఉండేది. ఎన్డీయే ప్రభుత్వంతో కలిసి తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా పనిచేశారు. ఆయన మంచి వ్యక్తి, భావుకత పుష్కలంగా ఉన్న కవి కూడా. ప్రధానిగా సేవలందిస్తూ ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొన్న సమర్ధుడు ఆయన. ఆయన విధివిధానాలు పలువురికి పారదర్శకంగా నిలిచాయి. అంతటి మహోన్నత రాజకీయ నాయకుడిని కోల్పోవడం బాధాకరమే కాదు, జాతీయ స్థాయి రాజకీయాలకు తీరని లోటు.