మహిళా సర్పంచ్ పై దాడి.. పోలీసుల చర్యకు మండిపడ్డ సర్పంచ్…?

దేశం రోజురోజుకీ సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుత కాలంలో మగవారితో పాటు ఆడవారికి కూడా సమాన హక్కులు కల్పిస్తున్నారు. అయితే సమాజంలో మాత్రం మహిళలను దారుణంగా అవమాన పరుస్తున్నారు. కార్యాలయాల్లో, ఇంట్లో, సమాజంలో ఎక్కడ చూసినా మహిళలను తక్కువ చేసి మాట్లాడటమే కాకుండా కొన్ని సందర్భాలలో వారిపై దాడులకు కూడా దిగుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల మహిళా సర్పంచ్ పై 15 మంది కలిసి దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మహిళా సర్పంచ్ మీద దాడి చేయడమే కాకుండా ఆమె కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేశారు. ఈ ఘటన బుల్దానా జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…బుల్దానా జిల్లాలో మెహకర్ తాలూకాలోని సరశివ్ గ్రామంలో ఓ మహిళా సర్పంచ్ పై 15 మంది దారుణంగా దాడి చేశారు. ఉచితంగా సర్పంచ్ అయిందన్న కారణం తో మహిళా సర్పంచ్ తో పాటు ఆమె కుటుంబసభ్యుల మీద కూడా దాడి చేశారు. దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై మహిళా సర్పంచ్ రమాబాయి జాదవ్ ఫిర్యాదు చేసేందుకు తొలుత జనఫల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. అయితే ఆమె ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. దీంతో మహిళా సర్పంచ్ నేరుగా జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.

జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు స్వీకరించిన తరువాత మహిళను మళ్లీ జనాఫాల్ పోలీస్ స్టేషన్‌కు పంపారు. అయితే ఆ మహిళ జనఫల్ పోలీస్ స్టేషన్‌ కి వెళ్ళిన తర్వాత కూడా నిందితులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా కూడా మహిళ సర్పంచ్ ఏమి చేయలేని స్థితిలో ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, మహిళా సంఘాలు పోలీసుల వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. అయితే మహిళా సర్పంచ్ మాత్రం తనకు న్యాయం జరిగే వరకు అక్కడినుండి కదలనని పోలిష్టేషన్ ఎదుట నిరసనకు దిగింది.