ఎంతో గౌరవప్రదమైన పోలీస్ వృత్తిలో ఉన్న కొంతమంది పోలీసులు తమ వృత్తికి విలువ ఇవ్వకుండా నీచలకు పాల్పడుతున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు చట్టానికి విరుద్ధమైన పనులు చేస్తూ పట్టుబడుతున్నారు. కామాంధుల నుండి మహిళల్ని కాపాడాల్సిన ఒక పోలీస్ అధికారి ఒక యువతి పట్ల ప్రవర్తించిన తీరు పోలీస్ వ్యవస్థకు కలంకంగా మారింది. బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన పోలీసు అధికారి ఒక యువతి పై అత్యాచారం చేసిన ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.
వివరాలలోకి వెళితే…హైదరాబాద్‌కు చెందిన మెడికల్ విద్యార్థిని (21) జిప్మర్‌లో ప్రసిద్ధ మెడికల్ కాలేజీలో జరిగే సెమినార్‌కు హాజరయ్యింది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి పక్కనే ఉన్న హోటల్లో ఉంటుంది. తాజాగా సెమినార్ ముగించుకొని రెండు రోజుల క్రితం రాత్రి సమయంలో రోడ్డుపై ఒక్కతే నడుచుకుంటూ హోటల్ కి వెళుతుంది. ఆ సమయంలో అక్కడ ఉన్న కన్నెర్ అనే పోలీస్ కానిస్టేబుల్ అతని స్నేహితుడు ఆమెనుచూశారు. యువతి ఒంటరిగా వెళుతుండటంతో చుట్టుపక్కల ఎవరో లేరని గమనించిన కానిస్టేబుల్ అతని స్నేహితుడు బలవంతంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.
అయితే తమ స్నేహితురాలు ఎంతసేపటికి హోటల్ గదికి చేరుకోకపోవటంతో తనకోసం వెతుకుతూ కాలేజ్ కి బయలుదేరిన యువతీ స్నేహితులు కొంత దూరం వెళ్ళగానే దారిలో ఇద్దరు వ్యక్తులు యువతిపై అత్యాచారం చేస్తున్న ఘటన కనిపించింది. వెంటనే వారు గట్టిగా కేకలు వేయడంతో కానిస్టేబుల్ సహా అతని స్నేహితుడు అక్కడి నుండి పరారయ్యారు. వెంటనే సదరు యువతిని చికిత్స కోసం జిప్మర్‌లో కు తరలించారు. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.