దేశరాజధాని లో దారుణం… ఫోన్ ఇవ్వనందుకు 45 సార్లు కత్తితో పొడిచిన మైనర్ బాలుడు!

నేరాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినప్పటికీ రోజు రోజుకి నేరాలు సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గటం లేదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మైనర్లు కూడా నేరాలకు ఎక్కువగా పాల్పడుతున్నారు. తెలిసి తెలియని వయసులో ఆవేశానికి వెళ్లి ఇతరులను హత్య చేసే స్థాయికి చేరుకున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇలాంటి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఫ్రెండ్ ఫోన్ ఇవ్వలేదన్న కారణంతో ఇద్దరు మైనర్ బాలలు కత్తితో పొడిచి చంపిన ఘటన సంచలనంగా మారింది.

వివరాలలోకి వెళితే…దక్షిణ ఢిల్లీలోని భాటి మైన్స్ లోని సంజయ్ కాలనీలో నివాసం ఉంటున్న 18 ఏళ్ల హర్ష్ కుమార్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి దెబ్బ తగలడంతో ఆరోజు కళాశాలకు వెళ్లేలేదు. శనివారం మధ్యాహ్నం నూడుల్స్ కొనేందుకు బయటకు వెళ్తున్నాని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత మైదాన్ గర్షి వద్దనున్న రాధాకృష్ణ దేవాయలం సమీపంలో తనతోటి స్నేహితులతో కలిసి హర్ష్ కుమార్ సరదాగా కార్డ్స్ ఆడుతున్నాడు. ఆ విషయం గుర్తించి ఇద్దరు బాలురు అక్కడకు వెళ్లి హర్ష్ కుమార్ ఫోన్ లాక్కునే ప్రయత్నం చేశారు. కుమార్ ప్రతిఘటించటంతో సదరు మైనర్ బాలులలో ఒకరుతన వెంట తెచ్చుకున్న కత్తి తీసి.. కుమార్ పై దాడి చేయడం ప్రారంభించాడు.

ఇలా శరీరం మొత్తం 45 సార్లు పొడిచి హర్ష్ కుమార్ ను హత్య చేశాడు. ఈ ఘటనతో తీవ్రంగా భయపడిపోయిన హర్ష్ స్నేహితులు పారిపోయారు. హత్య అనంతరం నిందితులు హర్ష్ కుమార్ ఫోన్ లాక్కొని వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు ఇంటికి రాకపోవడంతో.. హర్ష్ కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఎంతకూ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇంతలోనే మైదాన్ గర్షి వద్ద ఓ మృతదేహం ఉందంటూ పలువురు స్థానికులకు సమాచారం అందించటంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతుడు హర్ష్ కుమార్ గా గుర్తించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులను సమాచారం అందించారు. ఆ తర్వాత హర్ష కుమార్ స్నేహితులను విచారించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.