హైదరాబాద్ పాతబస్తీలో దారుణం..ఓయో రూంలో మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్!

ప్రస్తుత కాలంలో ఆడపిల్లలకు ఎక్కడ రక్షణ లేకుండా పోతుంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ఒంటరిగా బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురయింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మైనర్ బాలికల మీద అత్యాచార నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇక ఇటీవల హైదరాబాదులోని పాతబస్తీలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. మైనర్ బాలికను కిడ్నాప్ చేసి ఆమెకు మత్తుమందు ఇచ్చి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే… ఇటీవల హైదరాబాద్ లోని పాతబస్తీలో 13 ఏళ్ల మైనర్ బాలికను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి ఆ బాలికను ఓయో లాడ్జి కి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మైనర్ బాలికకు మత్తుమందు ఇచ్చి రెండు రోజుల పాటు బాలిక మీద సామూహిక హత్యాచారం చేశారు. ఆ తర్వాత బాలికను గదిలో వదిలేసి నిందితులు పరారయ్యారు. రెండు కూతురు కనిపించకపోవడంతో ఆమె కోసం వెతికిన తల్లిదండ్రులకు రెండు రోజులు తర్వాత కూతురు ఇంటికి చేరుకుంది.

ఆ తర్వాత తనని కిడ్నాప్ చేసి సామూహిక హత్యాచారం చేసిన విషయం తల్లి తండ్రులకు వివరించింది. దీంతో బాధితురాలి తల్లి తండ్రులు ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి తల్లి తండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలిక చెప్పిన ఆధారాలను బట్టి నిందితుల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.