ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్ష షెడ్యూల్ విడుదలయింది.
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి.
ఉదయం 9.30 నుంచి 12.15వరకు పరీక్షా సమయం. సుమారు 6లక్షల10వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 7వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెల రోజులలో పరీక్షా ఫలితాల విడుదల చేస్తామని ఈ రోజు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2835 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తారు.
రాష్ట్ర వ్యాప్తంగా సున్నితమైన కేంద్రాల గుర్తించారని, 91కేంద్రాల్లో సీసీ టీవీ ల ఏర్పాటు చేస్తారని మంత్రి చెప్పారు.
150 ఫ్లైయింగ్ స్క్వాడ్ లు ఏర్పాటు చేశారు. నామినల్ రోల్స్ మొత్తం ఆన్లైన్ లో స్వీకరిస్తారు. హాల్ టికెట్స్ వెబ్ సైట్స్ నుంచి డౌన్ లోడ్ చేసి విద్యార్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. 2104లో దేశంలో 17వ స్థానం నుంచి 2018నాటికి 3వ స్థానానికి రాష్ట్ర విద్యా శాఖ వృద్ది చెందిందని ఆయన చెప్పారు.