ఏపీ ఎన్నికల అధికారి ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఐఎఎస్ అధికారి గోపాలకృష్ణ ద్వివేది నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. మరో రెండు నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీనికి ముందే- కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ఆరంభించింది. సిసోడియాను బదిలీ చేయడానికి గల కారణం కూడా ఇదే. రాష్ట్ర విభజన చోటు చేసుకున్న వెంటనే సిసోడియా ఎన్నికల అధికారిగా నియమితులయ్యారు. అప్పటి నుంచీ ఆయన అదే స్థానంలో కొనసాగుతున్నారు.