బ్రతుకుతెరువు కోసం భిక్షాటన చేస్తున్న మేనమామ.. దారుణంగా హత్య చేసిన అల్లుడు..?

మేనమామ భిక్షాటన చేస్తుండటం వల్లే తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని, అతడిని మేనల్లుడు దారుణంగా హత్య చేసి రైలు పట్టాల మీద పడేసిన ఘటన పెద్దపల్లిలో ఇటీవల చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…పెద్దపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ నెల 4న గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితితో మృతి చెందిన చేపట్టారు. ట్రాక్‌కు కొద్ది దూరంలో మృతదేహం పడి ఉండటం సందేహాలకు తావిచ్చింది. రైలు నుంచి ప్రమాదవశాత్తు పడిపోయినా, దూకినా సమీపంలోనే పడిపోతాడని, ట్రాక్‌ నుంచి 100 అడుగుల దూరంలో మృతదేహం ఉండటంవ్యక్తిని గమనించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అసాధ్యమని భావించిన పోలీసులు స్టేషన్‌కు వెళ్లే మార్గంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో అనుమానాస్పదంగా కనిపించిన ఆటోను గుర్తించారు. అలాగే సెంటినరీకాలనీలోని సీసీ ఫుటేజీలోనూ అదే ఆటోను పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో మంగళవారం పెద్దపల్లి బస్టాండ్‌ సమీపంలో ఎస్సై రాజేశ్‌ వాహనాలు తనిఖీ చేస్తుండగా అదే ఆటో కనిపించడంతో పోలీసులు ఆ ఆటో డ్రైవర్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. ఈ క్రమంలో షాపింగ్ విషయాలు బయటకు వచ్చాయి. రామగిరి మండలం సెంటినరీకాలనీకి చెందిన చిప్పగుర్తి శివ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడి మేనమామ మారుపాక రాయమల్లు(50) స్థానికంగా చెప్పులు కుట్టడంతో పాటు భిక్షాటన చేసేవాడు. అయితే కొంతకాలంగా శివకు పెళ్లి చేయాలని తల్లితండ్రులు ప్రయత్నించినప్పటికి శివకు పెళ్లి సంబంధాలు రావడం లేదు.

దీంతో తన మేనమామ భిక్షాటన చేస్తుండటం వల్లే తనకు పెళ్లి సంబంధాలు రావడం లేదని శివ అతనిమీద కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో అతడి హత్యకు పథకం వేసి ఈ నెల 3న సెంటినరీకాలనీలోనే రాయమల్లుపై దాడి చేసి ఆటోలో పెద్దపల్లికి తీసుకొచ్చారు. రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటంతో సమీపంలోని ఖాళీ స్థలానికి తీసుకెళ్లి కర్రతో రాయమల్లు తల, ఇతర శరీర భాగాలపై మరోసారి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని శివ ట్రాక్‌ పక్కన పడేసి వెళ్లిపోయానని శివ నేరం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేశారు.