ఇటీవలె జరిగిన వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిని హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై నిందితుడికి శిక్ష పడడంతో వరంగల్ పోలీసులు నిందితుడికి శిక్ష తగ్గింపు పై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు పోలీస్ కమిషనర్ డాక్టర్ వి. రవీందర్ సోమవారం ప్రకటించారు. హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది నెలల చిన్నారిపై ఆత్యాచారం, హత్యకు పాల్పడిన నిందితుడు పోలేపాక ప్రవీణ్‌కు మరణశిక్షను విధిస్తూ కొన్ని నెలల క్రితం వరంగల్ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో వరంగల్ ప్రత్యేక కోర్టు ఇచ్చిన మరణ శిక్ష తీర్పుపై పూర్వపరాలను పరిశీలించిన హైకోర్టు ప్రవీణ్‌కు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా సవరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ తీర్పుపై వరంగల్ కమిషనరేట్ పోలీసులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తున్నట్లుగా సోమవారం ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 19న అర్ధరాత్రి హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. ఆ రోజు సంచలనం సృష్టించిన ఈ దుర్ఘటనలో బాలికలపై లైంగిక దాడుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టు, నిందితుడు పోలెపాక ప్రవీణ్‌కు ఉరి శిక్ష విధించింది.
ఈ తీర్పును సవాలుగా తీసుకున్న నిందితుడు తిరిగి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం శిక్షను తగ్గిస్తూ నిందితుడు మరణించే వరకు జైలులోనే ఉండాలని కొత్త తీర్పు వెలువరించింది. తాజాగా ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు వరంగల్ పోలీసులు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నిందితుడికి హైకోర్టు శిక్ష తగ్గించడంపై పలువురు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదిలా ఉంటే అసలు ఒకసారి శిక్ష అమలయ్యాక అటువంటి దోషులకు శిక్ష తగ్గించడం అనేది జరగకూడదు. ఇలాంటి న్యాయస్ధానాలు ఉన్నంత వరకు దేశంలో అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. పైగా చిన్నారిని కూడా అలా చేయాలన్న ఆలోచనే చాలా దారుణం అలాంటి వాడికి క్షమా భిక్షా అని కొందరు చాలా మంది దీని పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.