http://https://www.youtube.com/watch?v=mf5mF1SWGWI
దక్షిణ ప్లోరిడాలో ఇటీవలె ఓ ఎన్‌కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డు పైనే ఇద్దరు దుండగులను కాల్చిన ఘటన అక్కడే ఉన్న ట్రాఫిక్ కెమెరాకు చిక్కుకుంది వీడియో. ఇద్దరు దుండగులు విలువైన వస్తువులను తీసుకువెళుతూ యుపీఎస్ (United Parcel Service) ట్రక్కును హైజాక్ చేశారు. అంతేకాకుండా ట్రక్కును నడిపే డ్రైవర్‌ను బెదిరించారు. ట్రక్కు వెళ్ళే దారిని మళ్లించారు. సమాచారం అందున్న పోలీసులు ఆ ట్రక్కును వెంబడించారు. దీంతో దుండగులు పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో పోలీసులు ట్రక్కు మీదకు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో ఇద్దరు దుండగులతోపాటు ట్రక్కు డ్రైవర్, ఆ ట్రక్కు పక్కన ఉన్న మరో వ్యక్తి చనిపోయారు. WCSV/WTVJ ఫొటోగ్రాఫర్ ఈ ఘటనను చిత్రీకరించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే ఇక్కడ ఎంతో ఘోరమైన ఘటన జరిగితేనే గాని అటువంటి కఠిన నిర్ణయాలను పోలీసులు తీసుకోరు. పోలీసులకు అటువంటి స్వేచ్ఛ కూడా ఉండదు. నేరస్తులను అంత కఠినంగా శిక్షించడానికి పోలీసులు పూనుకోరు. ఎందుకంటే ఇక్కడ జరిగే నేరాల వెనుక ఎంతో మంది ప్రమేయం ఉంటుంది. వారురాజకీయ నాయకులుకావొచ్చు. బడాబాబులు కూడా ఎంతో మంది ఉండవచ్చు. దాంతో పాటు పోలీసుల ప్రోద్బలంతో కూడా ఇటువంటి నేరాలు జరగడం మన దేశంలో సహజం. దీనికి వ్యవస్థలన్నీ పూర్తిగా అవినీతిలో పూరుకుపోవడమే దీనికి కారణం. కానీ అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడ నేరం జరిగిన వెంటనే తక్షణమే రంగంలోకి దిగి పోలీసులు నేరగాళ్ళ ఆటకట్టిస్తారు.
అక్కడి వ్యవస్థ ఆపద్ధతులు వేరేగా ఉంటాయి. వాటికి కట్టుబడి అక్కడి ప్రజలు ఉంటారు. నేరం చేసిన ప్రతి వ్యక్తికి శిక్షపడిలన్న సిద్ధాంతాన్ని అక్కడ వ్యవస్థ ఖచ్చితంగా పాటిస్తుంది. కానీ ఎక్కడికక్కడ అవినీతి ఊభిలో కూరుకుపోయిన భారతదేశం లాంటి వ్యవస్థల్లో ఇటువంటి కఠిన శిక్షలకు ఆస్కారం ఉండదు.