సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మరో సంగీత ఉదంతం బయటపడింది. భర్త, అతని సోదరుడు కలిసి భార్యను ఆమె తల్లిదండ్రులను కర్రలతో చితకబాదారు. హయత్ నగర్‌కు చెందిన రఘురామిరెడ్డి అనే వ్యక్తికి పటాన్‌చెరుకి చెందిన అనూషతో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. రఘురామిరెడ్డి అతని భార్యను రోజూ వేధిస్తుండేవాడు. వేధింపులు తాళలేక ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ నేపధ్యంలో కూతురికి నచ్చచెప్పి తల్లిదండ్రులు సంసారానికి పంపిస్తుండగా ఈ ఘటన జరిగింది.
రెండేళ్ళ క్రితం అనూషకి రఘురామ్‌తో వివాహం జరిగింది. కానీ అనూషను నిత్యం రఘురామ్ అతని భర్యా అయిన అనూషను వేధింపులకు గురి చేస్తుండేవాడు. వేధింపుల పై మాట్లాడేందుకు కూతురుని తీసుకుని అనూష తల్లిదండ్రులు కూడా పటాన్‌చెరు రఘురామిరెడ్డి ఇంటికి వెళ్ళారు. తిరిగి భర్త ఇంటికి కాపురానికి వస్తున్న నేపధ్యంలో కాపురం కుదిర్చి ఇద్దరి మధ్య నచ్చజెప్పి కాపురానికి పంపిద్దామనుకునే తల్లిదండ్రులకు ఆ ఇంట్లో చేదు అనుభవం ఎదురయింది.
అనూష తన తల్లిదండ్రుడుల కలిసి కొద్ది సేపటి కాపురానికి పటాన్‌చెరులో ఉన్న రఘురామ్ కొత్త ఇంటికి బయలుదేరింది. అక్కడికి రాగానే ఒక్కసారిగా రఘురామ్‌రెడ్డి, అతని సోదరుడు అత్తమామ అతని సోదరి మొత్తం ఐదుగురు కలిసి అనూషను ఆమె తల్లిదండ్రులను విపరీతంగా కర్రలతో దాడికి దిగి చితకబాదారు దాంతో ఆగక రఘురామ్‌రెడ్డి బెల్డు తీసుకుని మరి ఆమెను చితకొట్టారు. అనూష చేతిలో ఏడాదిన్నర పాప ఉందని కూడా చూడకుండా గొడ్డును బాదినట్టు బాదారు. కనీసం పాప మొహం కూడా చూడకుండా కొట్టారు. దీంతో చుట్టుప్రక్కల వాళ్ళు ఆపడానికి ప్రయత్నించారు. కాని ఆగకపోవడంతో స్థానికులు వెంటనే అనూషను పోలీస్‌స్టేషన్‌కి పంపించారు. రఘురామిరెడ్డి అతని కుటుంబసభ్యుల పైన కేసు పెట్టారు. దీంతో పోలీసులు కేసును నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటన చూస్తుంటే మరో సంగీత ఘటన కనపడుతుంది. ఇక రోజు రోజుకూ మహిళల పై అఘాయిత్యాలు ఎక్కువవుతున్న తరుణంలో ఎన్ని శిక్షలు విధించినా సరే ఏమాత్రం తగ్గడం లేదు. పైగా వివాహితుల వేధింపులు కూడా ఎక్కువయిపోతున్నాయి.