అత్తపై అత్యాచారం, బయిటపెడితే భార్యకు విడాకులని బెదిరింపు
మహిళలపై జరుగుతున్న నేరాలు, అత్యాచారాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా ఓ షాకింగ్ ఇన్సిడెంట్ లో హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఓ మహిళను తన కుమార్తె భర్త (అల్లుడే) రేప్ చేసి బెదిరించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్ ల కథనం ప్రకారం…ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలోకి సదరు వ్యక్తి తన అత్తగారిని బలవంతంగా తీసుకెళ్లి రేప్ చేసాడు.
ఆ తర్వాత ఆమెను ఇంటికి తీసుకొచ్చి వదిలి, ఈ విషయం బయిటపెడితే నీ కూతురుకి విడాకులు ఇచ్చేస్తా అని బెదిరించాడు. అయితే ఆమె ఆ బెదిరింపుని లెక్క చేయక పోలీస్ లను ఆశ్రయించి, ఆ దుర్మార్గుడు గుట్టు రట్టు చేసింది. అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
రేప్ చేసిన సదరువ్యక్తి పేరు భాస్కర్ అని, అతను ఓల్డ్ సిటీలోని కండికల్ ప్రాంతానికి చెందిన వాడిని తేలింది. ఏడాది క్రితం ఆమె కుమార్తెను పెళ్లి చేసుకున్నాడని, అయితే అప్పుడప్పుడూ ప్రవర్తన అనుమానంగా ఉన్నా…అల్లుడే కదా ఏదో సరాదాకి అనుకున్నట్లు సరిపెట్టుకున్నామని, ఇంత దారుణం చేస్తాడని ఊహించలేదంది.
ఈ కేసుని ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376, 506 ప్రకారం నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు పోలీస్ లు. అత్యాచారం చేసిన భాస్కర్ ని జ్యుడిషియల్ కస్టడీకు పంపటం జరిగింది. ఆమెను గవర్మమెంట్ హాస్పటిల్ కు మెడికల్ అసెస్టెంట్స్ కోసం పంపారు.
ఈ సంవత్సరం మొదట్లో గుజరాజ్ లోనూ ఇలాంటి సంఘటన కు సంభందించి ఓ వ్యక్తికి జీవిత కాల జైలు శిక్ష వేసారు. అతను తన సొంత తల్లి పైనే అత్యాచారం చేయటం అప్పట్లో సంచలనం సృష్టించింది.