తిరుమల శ్రీవారి ఆలయ సమీపంలో విషాదం నెలకొంది. వాహన మండపం వద్ద లారీ కింద పడి ఓ భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రమాదవశాత్తు జరిగిందేమోనని పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తూ.. ఉండగా సీసీ టీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. అయితే సీసీ ఫుటేజ్‌లలో మాత్రం భక్తుడే వెనుక టైర్లు కింద పడినట్లు స్పష్టంగా కనిపించింది. మృతుడు చెన్నై వాసిగా గుర్తించారు. తిరుమలలో చనిపోతే వైకుంఠానికి చేరుకుంటారన్న విశ్వాసంతోనే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. భక్తులు మూఢనమ్మకాలు వదిలి పెట్టాలని.. ఇలా చేయడం మంచిది కాదని TTD ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
అయితే ఆ సమయంలో ఆయన అక్కడ లేరని వేరే ఊరిలో ఉన్నట్లు తెలిపారు. ఘటన జరగిన వెంటనే ఆయనకు విషయం అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్లు తెలిపినట్లు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఒకసారి సీసీ టీవీలను పరీక్షించాల్సిందిగా తెలుపగా సీసీటీవీలో అసలు నిజం బయటపడింది. అయితే తెల్లవారుజామున పాలవ్యానులు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. స్వామివారి ఆలయానికి ప్రతి రోజు పాలవ్యానులు ఆ లారీలో పాలవ్యాన్ వెళుతుందని అక్కడ అందరూ చూస్తుండగా భక్తుడు కావాలని ఆ వ్యాన టైర్ కింద పడి చనిపోయినట్లు గుర్తించారు. ఇలా దైవసన్నిధానంలో చనిపోతే ఏకంగా వైకుంఠానికి వెళతామని కొందరు నమ్ముతారని అలాంటి మూఢ నమ్మకాలు మంచిది కాదని ఆయన అన్నారు. ఎప్పుడైనా భక్తి ఉండాలి కాని మరీ పిచ్చి ఉండకూడదు. భక్తి అనేది దేవుడికి ఏ విధంగా అయినా చూపించవచ్చు కానీ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయి మరి ఇలాంటి ఘటనలకు మాత్రం తలపడకూడదు. అయితే ఇలాంటి సంఘటన మునుపెన్నడు జరగలేదని ఆయన తెలిపారు. ఇకముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా భద్రాతని పెంచాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.