ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య చిచ్చు… చివ‌రికి ఏం జ‌రిగిందంటే…?

స్నేహ‌మంటే ఒక‌రిని ఒక‌రు న‌మ్మ‌డం. ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు గౌర‌వించ‌డం అలాగే ఒక‌రి అభిప్రాయాల‌ను మ‌రొక‌రు ఇష్ట‌ప‌డ‌డం. ఇవ‌న్నీ కూడా స్నేహ‌మే. కానీ అదే స్నేహ ముసుగులో ఒక‌రు మ‌రొక‌ర్ని మోసం చేస్తే ఇంక ఆ న‌మ్మ‌కానికి వెలువేముంట‌ది. ఆ బంధానికి గౌర‌వ‌మేముంట‌ది అలాంటి ఘ‌ట‌నే ఒక‌టి క‌డ‌ప జిల్లాలో చోటుచేసుకుంది.

చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌లిసి మెలిసి ఒక త‌ల్లిపిల్ల‌ల్లా పెరిగారు. చుట్టుప‌క్క‌ల వారైనా స‌రే ఎప్పుడూ వారిలో ఆ బేధాభిప్రాయాలు లేకుండా చిన్న‌ప్ప‌టి నుంచి కూడా ఎంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా పెరిగారు. పెద్దయ్యే కొద్దీ వారి స్నేహ బంధం కూడా మ‌రింత బ‌లంగా మారింది. అదే బంధంలో అనుకోకుండా ఓ చిచ్చు రేగి ఒక‌రి ప్రాణం పోవ‌డానికి కూడా కార‌ణ‌మైంది. షేక్‌ మహమ్మద్‌ హుస్సేన్‌(25), ఏజీగార్డన్‌కు చెందిన షేక్‌ యూసూఫ్‌ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే యూసూఫ్ బంధువైన ఓ మహిళతో హుస్సేన్ కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో వారిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ముందులో ఒక‌సారి ఎంతో సామ‌ర‌స్యంగా ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని చెప్పాడు. కానీ హుస్సేన్ మాత్రం అస్స‌లు ఆ మాట‌ని ఏమాత్రం కేర్ చేయ‌కుండా త‌న ప‌ని తాను చేసుకుని వెళుతున్నాడు.

దీంతో హుస్సేన్‌ని చంపేయాలని యూసూఫ్ నిర్ణయించుకున్నాడు. సోమవారంనాడు తన కుటుంబ సభ్యులతో పాటు మరో స్నేహితుడు మౌలాల సాయంతో సోమవారం హుస్సేన్ పై కత్తులతో దాడి ఒడిగ‌ట్టాడు. ఏమాత్రం క‌నిక‌రం లేకుండా స్నేహితుడ‌న్న విష‌యాన్ని మ‌రిచి తీవ్రంగా గాయ‌ప‌రిచాడు. దీంతో అతడు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వెంటనే యూసూఫ్‌ పోలీసులకు లొంగిపోయాడు. మృతుడు హుస్సేన్‌ తల్లి షేక్‌ మహబూబున్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచోటి పోలీసులు ఈ హ‌త్య‌కు ఎవ‌రెవ‌రైతే సాయ‌ప‌డ్డారో వారంద‌ర్నీ అదుపులోకి తీసుకుని కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. మ‌నం చేసే ఒక్క త‌ప్పు వ‌ల్ల ఎన్ని అన‌ర్దాలు జ‌రుగుతాయ‌న్న‌ది కాస్త గ్ర‌హించాలి. త‌ప్పు చేయ‌డ‌మ‌నేది చాలా ఈజీ కానీ స‌రిదిద్దుకోలేని త‌ప్పులు ఎప్పుడూ చేయ‌కూడ‌దు.a