దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ప్రయోజనం చేకూరే విధంగా వేర్వేరు స్కీమ్స్ ను అమలు చేస్తుండగా ఈ స్కీమ్స్ వల్ల భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ను ఓపెన్ చేయడం ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ను పొందవచ్చు. పొందే వేతనాన్ని బట్టి ప్రయోజనాల విషయంలో కూడా మార్పులు ఉంటాయని సమాచారం అందుతోంది.
2 లక్షల రూపాయల కంటే ఎక్కువ వేతనం ఉన్నవాళ్లకు ఎస్బీఐ రోడియం అకౌంట్ లభించనుండగా లక్ష రూపాయల నుంచి 2 లక్షల రూపాయల మధ్య వేతనం పొందే వాళ్లు ప్లాటినం అకౌంట్ ను పొందవచ్చు. 50 వేల కంటే ఎక్కువ వేతనం వచ్చేవాళ్లు డైమండ్ అకౌంట్ ను పొందే అవకాశం ఉంటుంది. 25,000 నుంచి 50,000 మధ్య వేతనం వచ్చేవాళ్లు గోల్డ్ అకౌంట్ ను తీసుకునే అవకాశం ఉంటుంది.
20,000 రూపాయల లోపు వేతనం వచ్చేవాళ్లు సిల్వర్ అకౌంట్ ను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ అకౌంట్ ను కలిగి ఉంటె పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ (డెత్) బెనిఫిట్ కలిగే అవకాశం ఉంటుంది. ఈ అకౌంట్లను కలిగి ఉన్నవాళ్లు లాకర్ రెంటల్ చార్జీలపై 50 శాతం వరకు డిస్కౌంట్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ అకౌంట్ ద్వారా ఎస్ఎంఎస్ అలర్ట్స్ కూడా ఉచితంగా పొందవచ్చు. డీమ్యాట్, ఆన్లైన్ ట్రేడింగ్ అకౌంట్ సర్వీసులను సైతం ఈ శాలరీ అకౌంట్ ద్వారా సులువుగా పొందవచ్చు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఉన్నవాళ్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో రెండు నెలల వేతనాన్ని పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎస్బీఐలో శాలరీ అకౌంట్ ఓపెన్ చేసి ఈ ప్రయోజనాలను పొందవచ్చు.