నెలకు రూ.5000 డిపాజిట్ చేస్తే రూ.2.75 కోట్లు.. అలా డిపాజిట్ చేస్తే చాలంటూ?

మనలో చాలామంది మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఆర్థికంగా ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నెలకు 5000 రూపాయలు మ్యూచువల్ ఫండ్స్ లో డిపాజిట్ చేస్తే ఏకంగా 2.75 కోట్ల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుంది. సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది.

 

ఈక్విటీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని పొందవచ్చు. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుందనే విషయాన్ని సైతం గుర్తుంచుకోవాలి. ప్రణాళిక ప్రకారం పెట్టుబడులు పెట్టడం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ మంచి లాభాలను అందిస్తాయి. నెలకు 5,000 రూపాయల చొప్పున 18 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 రెట్లు ఎక్కువ మొత్తం పొందవచ్చు.

 

స్టాక్ మార్కెట్ రిస్క్ కు లోబడి మ్యూచువల్ ఫండ్స్ లో లాభాలను పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇందులో పెట్టుబడులు పెట్టేవాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో రాబడి రాకపోవచ్చు. స్టాక్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేటు పెరగడం, తగ్గడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకుని పెట్టుబడి పెడితే మంచిది.

 

ఏ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడితే ఎక్కువ లాభాలు వస్తాయో అందులో పెట్టుబడులు పెడితే బాగుంటుంది. మ్యూచువల్ ఫండ్స్ గురించి అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టవద్దు. తక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలను ఆర్జించాలని భావించే వాళ్లకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది.