వినయ విధేయ రామ రికార్డ్స్ ఇవే

బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ ,కియారా అద్వానీ హీరో హీరోయిన్ గా డీవీవీ దానయ్య సమర్పణలో రూపొందించిన చిత్రం వినయ విధేయ రామ. ఈ సినిమా శుక్రవారం (11-1-2019) రిలీజ్ అయింది.

ఎవరూ ఊహించని విధంగా సినిమా పరాజయం చెందింది. అయితే ఈ సినిమా ఫ్యామిలీ ఆడియోన్స్ కి సరిగ్గా కనెక్ట్ కాలేదు. కానీ మాస్ ప్రేక్షకుల నుండి సినిమా మంచి ఆదరణ పొందుతున్నది.

వినయ విధేయ రామ రికార్డ్స్

ఈ సినిమా సీడెడ్ లో బాహుబలి 2 సినిమా పేరిట ఉన్న రికార్డుని బద్ధలు కొట్టడం విశేషం. వినయ విధేయ రామ సినిమా బాహుబలి 2 పేరిట ఉన్న డే వన్ రికార్డు ను బద్దలు కొట్టింది. బాహుబలి2 సీఈడెడ్ లో మొదటి రోజు 6.35 కోట్ల షేర్ రాబట్టింది. ఇన్ని రోజుల వరకు ఈ సినిమా రికార్డు ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. కానీ నిన్న రిలీజ్ అయిన వినయ విధేయ రామ ఏకంగా 7.20 కోట్ల షేర్ ని రాబట్టింది.

గుంటూరులో అల్ టైం నాన్ బాహుబలి 2 రికార్డ్ , అట్లనే నెల్లూరు లో అల్ టైం నాన్ బాహుబలి 2 రికార్డ్ ని, ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలో అల్ టైం టాప్ 3 ఓపెనింగ్ మూవీగా రికార్డ్ నెలకొల్పి చరణ్ సత్త ఏంటో మరొక్కసారి చూపించాడు.

1.5 రేటింగ్ తో సినిమాని చరణ్ భుజాల మీద పెట్టారు. రామ్ చరణ్ తన దమ్ము ఏంటో చూపించాడు. ఈ సినిమాకు ఎటు నుండి కూడా మంచి ఆదరణ లేదు. ఒక్క మాస్ ప్రేక్షకుల నుండి తప్ప.  మాస్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కిక్ ఇచ్చేలా సినిమాను రూపొందించి ఉంటే సంక్రాంతి పండుగవేళ రికార్డుల మోత మోగిపోయి ఉండేదని మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ప్చ్ అంటూ నిట్టూరుస్తున్నారు.