నితిన్ కి డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చిన “విక్రమ్”..లేటెస్ట్ కలెక్షన్ డీటెయిల్స్ ఇవే.!

Kamal Haasan Vikram

కొన్ని సినిమాలు సైలెంట్ గా వచ్చి వైలెంట్ హిట్స్ అవుతూ ఉంటాయి. మంచి బజ్ ఉంటుంది కానీ తక్కువ బిజినెస్ జరగడం అవి కాస్తా అనుకున్న దానికి మించి హిట్ అవ్వడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలను తెచ్చి పెడతాయి. ఇలాంటి అరుదైన ఫీట్ లు మన తెలుగులో అయితే చిన్న చిన్న సినిమాలు సెట్ చేస్తాయి ఒకోసారి డబ్బింగ్ సినిమాలు చేస్తాయి. 

అలాగే ఈసారి తెలుగులో డబ్ అయ్యి వచ్చిన చిత్రం “విక్రమ్” భారీ లాభాలను ఈ సినిమాని తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి స్టార్ హీరో నితిన్ కి అందించినట్టు ఇప్పుడు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు హక్కులు 6 కోట్లతో నితిన్ శ్రేష్ట్ మూవీస్ వాళ్ళు కొనుగోలు చేసి రిలీజ్ చేయగా.. 

ఈ చిత్రం ఏకంగా 26 కోట్లకి పైగా గ్రాస్ ని అలాగే ఒక లక్ష తక్కువ 13 కోట్ల షేర్ ని రాబట్టేసింది. అంటే కొన్న 6 కోట్లకి డబుల్ ప్రాఫిట్స్ ని ఈ చిత్రం ఇచ్చింది అని చెప్పాలి. ఇది ఇక్కడితో ఆగలేదు. తెలుగులో విక్రమ్ హవా ఇంకా కొనసాగుతుంది. ఫైనల్ రన్ లో అయితే 14 లేదా 15 కోట్ల షేర్ దగ్గర ఈ మార్క్ ఆగే అవకాశం ఉంది. 

మొత్తంగా అయితే నితిన్ మాత్రం విక్రమ్ తో భారీ లాభాలను అందుకున్నాడని చెప్పాలి. ఇంకా ఈ చిత్రంలో కమల్ తో పాటుగా సూర్య, ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వం విజయ్ సేతుపతిలు నటించగా లోకేష్ కనగ రాజ్ దర్శకత్వం అందించాడు అలాగే అనిరుద్ సంగీతం అందించాడు.