`సైరా` నుంచి మ‌రో లుక్‌!

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `సైరా.` స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహా రెడ్డి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌, జ‌గ‌ప‌తి బాబు, సుదీప్, విజ‌య్ సేతుప‌తి వంటి హేమాహేమీలు ఇందులో న‌టిస్తున్నారు. తాజాగా- త‌మిళ టాప్ హీరో విజ‌య్ సేతుప‌తి లుక్ బ‌య‌టికి వ‌చ్చింది.

Dxayx3Fxqaajza61 | Telugu Rajyam

బుధ‌వారం విజ‌య్ సేతుప‌తి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న లుక్‌ను విడుద‌ల చేసింది సైరా యూనిట్‌. నుదుట విబూధి, భుజాల వ‌ర‌కు జారిన జుట్ట‌, మెడ‌లో పులిగోరు, ఓ చేత్తో కొడ‌వ‌లి ప‌ట్టుకున్న లుక్‌.. ఆ క్యారెక్ట‌ర్ డెప్త్ ఎలాంటిదో చెబుతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు రామ్‌చ‌ర‌ణ్ నిర్మాత‌. కొణిదెల బ్యాన‌ర్ కింద ఈ మూవీ నిర్మిత‌మౌతోంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles