ట్రేడ్ రివ్యూ: ‘సురేష్ ప్రొడ‌క్ష‌న్స్’కిది బ్యాడ్ టైం!?

తెలుగులో ఒకప్పుడు బ్యానర్ పేరు చూసి సినిమాలకు వెళ్లే సంస్దల్లో సురేష్ ప్రొడక్షన్స్ ఒకటి. మెగా నిర్మాత రామానాయుడుగారు ఫామ్ లో ఉండి సినిమాలు చేసినంతకాలం ఆ స్టార్ డం అలాగే నడిచింది..నిలబడింది. సురేష్ ప్రొడక్షన్ లో సినిమాలు చేయాలని దర్శకులు, హీరోలు కలలు కన్నారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.

సురేష్ ప్రొడక్షన్ లో కథ ఓకే అయ్యిందన్నా దర్శకుల్లో ఉత్సాహం కనిపించటం లేదు. ఎందుకంటే గత కొన్నేళ్లుగా చాలా స్టోరీ లైన్స్ బాగున్నాయని ఓకే చేసి, స్టోరీ సిట్టింగ్ లు జరిపి ఏదో ఒక స్టేజిలో ఆగిపోయినవే ఎక్కువ. దాంతో అక్కడికి వెళ్లి కథ చెప్పాలనుకునేవారు తగ్గిపోతున్నారు. స్టోరి డిపార్టమెంట్ పెట్టినా ..పెద్దగా కలిసివచ్చినట్లు కనపడదు.

source: Facebook

అయితే గత రెండేళ్లుగా ఈ సంస్ద తమ దారి మార్చింది. చిన్న సినిమాలకు ఊరట నిస్తామంది. దాంతో అంతా ఈ ప్రొడక్షన్స్ వారు చిన్న సినిమాలు చేస్తారు అని ఆశపడ్డారు. అలా ఆశపడేలోగా వారికి అర్దమైంది ఏమిటి అంటే..చిన్న సినిమాల్లో బాగున్నవాటిని వారు తీసుకుని ప్రమోట్ చేసుకుని, తమ థియోటర్స్ వేసి డబ్బు చేసుకుంటారని. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో చిన్న సినిమాకు అది వరమే. ఎందుకంటే సురేష్ బాబు లాంటి నిర్మాత రిలీజ్ చేస్తున్నాడంటే ఆ సినిమాకు వచ్చే ఎటెన్షన్ వేరు. ముఖ్యంగా పెళ్లి చూపులు తర్వాత …అందరి దృష్టీ సురేష్ బాబు వైపుకు మళ్లింది.
ి
ఈ క్ర‌మంలోనే సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ‘పెళ్ళిచూపులు’ స‌హా కొన్ని మంచి సినిమాలొచ్చాయి. అయితే ఆ స్టాండర్డ్స్ తగ్గిపోవటం మొదలైంది. ఈ సంస్థ నుంచి వ‌స్తున్న సినిమాలు అంచ‌నాల్ని అందుకోవ‌ట్లేదు. ఇటు కలెక్షన్స్ రాక‌.. అటూ బ్యానర్ ఇమేజ్ దెబ్బ తిని ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డిపోయింది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్.

‘పెళ్ళిచూపులు’ త‌ర‌హాలోనే అద్బుతం అంటూ ప్రమోట్ చేసుకుని గత ఏడాది సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రిలీజ్ చేసిన ‘మెంట‌ల్ మ‌దిలో’వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత అంతకాదు..ఇంత ..మామూలుగా ఉండదంటూ వచ్చిన ఈ ఏడాది వచ్చిన ‘ఈ న‌గ‌రానికి ఏమైంది’ సినిమా విష‌యంలోనూ అదే రిపీట్ అయ్యింది. ఈ చిత్రం తీసిన వారికి చూసిన వారికి భారి షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత వచ్చిన ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ను సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ఓ రేంజిలో ప్ర‌మోట్ చేసింది. సినిమా కూడా బాగుంది. రిలీజ్ కు ముందే రివ్యూలు వ‌చ్చాయి కానీ.. వ‌సూళ్లు మాత్రం అంతంతమాత్రమే. అన్ని వర్గాలు వారికి ఈ సినిమా ఎక్కలేదు. సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ రివ్యూలు సైతం వచ్చాయి. అయితే ఈ సినిమా బ్యానర్ ప్రతిష్టను మాత్రం క్రిందకు దిగ జార్చలేదు.

తాజాగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్ కి మరో చిత్రం వచ్చి షాక్ ఇచ్చింది. అదే అదుగో మూవి. సురేష్ బాబు సైతం ఈ సినిమా గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్లుగా ఉండేలా చేసింది. ఈ బేన‌ర్లో వ‌చ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ఇదొక‌టి అని మీడియా మొత్తం ముక్త కంఠంతో అన్నారు. ఈ సినిమాకు రెవిన్యూ మాట దేవెడెరుకు… ..సురేష్ ప్రోడక్షన్స్ బ్యానర్ పేరు చెడగొట్టింది.

దీంతో ఈ బ్యానర్ లో ఓ చిన్న సినిమా వస్తుందన్నా …అది కూడా ఇలాంటి సినిమానే అవుతుందా అనే ఆలోచనలు జనాల్లో వెల్తున్నాయి. ఈ నేపధ్యంలో సురేష్ బాబు ఏ నిర్ణయం తీసుకుని తిరిగి బ్యానర్ ఇమేజ్ ని రిక్రియేట్ చేస్తారో చూడాలి.