‘ది లయన్‌ కింగ్‌’ ఇండియా కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

‘ది లయన్‌ కింగ్‌’ ఇండియా కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్

ఆ మధ్య కాలంలో భారతీయ బాక్సాఫీస్‌ వద్ద హాలీవుడ్‌ చిత్రాలు భారీ వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని ‘ది లయన్‌ కింగ్‌’ ప్రూవ్ చేసింది. జాన్‌ ఫెవరూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండు వారాల్లోనే రూ.128 కోట్లు కలెక్ట్ చేసి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌, ‘అవెంజర్స్‌:ఎండ్‌గేమ్‌’, కబీర్‌ సింగ్‌ చిత్రాలు రెండు వారాల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూలు చేయగా, ఇప్పుడు వాల్‌ డిస్నీ లయన్‌ కింగ్‌ కూడా అదే బాటలో పయనించిందని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

భారత్‌లో విడుదలైన అన్ని భాషల్లో ‘ది లయన్‌ కింగ్‌’ తొలివారంలో రూ.81.57కోట్లు వసూలు చేయగా, రెండో వారంలో రూ.45.75కోట్లు రాబట్టింది. మొత్తం రూ.127.32కోట్లు వసూలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 638మిలియన్‌ డాలర్లను వసూలు చేసింది. తెలుగు వెర్షన్‌కు నాని, పి.రవిశంకర్‌, జగపతిబాబు, అలీ, బ్రహ్మానందం, లిప్సిక ‘షేకింగ్‌’ శేషు తదితరులు డబ్బింగ్‌ చెప్పారు.