సవ్యసాచి ప్రీ రిలీజ్ బిజినెస్ తెలుసా ?

మైత్రి మూవీస్ వారు చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య , మాధవన్ తో నిర్మిస్తున్న “సవ్యసాచి ” ప్రీ బిజినెస్  ఎంత జరిగిందో తెలుసా ?
సవ్య సాచి సినిమా నవంబర్ 2 న విడుదలవుతుంది . నాగ చైతన్య ఇంతక ముందు నటించిన “శైలజారెడ్డి అల్లుడు ” చిత్రం బాగా నిరాశ  పరిచింది . అయినా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వ్యాపారం బాగానే జరిగిందని అంటున్నారు .  రెండు రోజుల క్రితం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది . నాగచైతన్య తో పాటు తమిళ్ ఆర్టిస్ట్ మాధవన్ కూడా ఉండటంతో ప్రీ  రిలీజ్ బిజినెస్  23.76 కోట్లవరకు జరిగిందని ఫిలిం ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి

నైజాంలో 6. 50 కోట్లు ,సీడెడ్ 3. 07 కోట్లు ,నెల్లూరు 70 లక్షలు ,కృష్ణ 1. 20 కోట్లు , గుంటూరు 1. 70 కోట్లు , వైజాగ్ 2. 50 కోట్లు , తూర్పు గోదావరి 1. 50 కోట్లు , పశ్చిమ గోదావరి 1. 07 కోట్లు కర్ణాటక 2కోట్లు, అమెరికా ఇతర దేశాలు కలసి 3. 52కోట్లు  అన్నీ కలసి 23. 76 కోట్ల వ్యాపారం జరిగిందని తెలుస్తుంది . ఇక శాటిలైట్  హక్కులు ఇంతకు అమ్ముడు పోతుందో చూడాలి . ఈ చిత్రంలో మాధవన్, నాగచైతన్య , భూమిక చావ్లా , నిధి అగర్వాల్ , రావు రమేష్, వెన్నెల కిషోర్ , భరత్ రెడ్డి నటిస్తున్నారు . నవీన్ యెర్నేని , వై . రవి శంకర్, సీవీ మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు .