సంపూ కూడా మొదలుపెట్టేసాడు…!

సంపూర్షేష్ బాబు కూడా సక్సెస్ టూర్ లతో రచ్చ

సినిమాకు హిట్ టాక్ వచ్చాక, కలెక్షన్స్ స్పీడు పెంచటానికి దర్శక,నిర్మాతలు రకరకాల ప్లాన్స్ చేస్తూంటారు. మీడియాలో ఇంటర్వూలు, సక్సెస్ మీట్ లు తో పాటు సక్సెస్ టూర్ లు సైతం ప్లాన్ చేస్తారు. సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట టీమ్ కూడా హిట్ టాక్ రావటంతో సక్సెస్ టూర్ ని ప్లాన్ చేసింది.

కొ

సంపూర్ణేష్ బాబు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతంలో నేడు రేపు విజయయాత్రలు చేయనున్నారు. కొబ్బరిమట్ట ప్రదర్శించబడుతున్న ఆయా థియేటర్లకు వెళ్లి నేరుగా అభిమానులను కలవనున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేసారు. 

ఇక కొబ్బరిమట్ట చిత్రంలో తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ తో బాగానే నవ్వించాడు సంపూ.. దానికి తగినట్లే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్ లు కనపడుతున్నాయి. గీతా ఆర్ట్స్ అండతో వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ తో శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ అమ్ముడైపోయినట్లు తెలుస్తోంది. దాంతో పెట్టిన పెట్టుబడి రికవరీ అయ్యిందని, ఫస్ట్ వీక్ లో వచ్చేది ఇంక లాభమే అంటున్నారు. ఈ నేపధ్యంలో నైజాంలో కూడా స్క్రీన్స్ పెంచుతున్నారు.

ఈ సినిమా క్రెడిట్ మొత్తం సంపూకి చెందుతుంది. సినిమా మొత్తాన్ని సంపూ తన భుజాల పైన వేసుకొని నడిపించాడు . పెదరాయుడు , ఆండ్రాయిడ్ ,పాపారాయుడు అనే మూడు పాత్రల్లో సంపూ నటన చించి ఆరేసాడు . చాలా సీన్స్ లో తనదైన విలక్షణమైన డైలాగు డెలవరీతో వావ్ అనిపిస్తాడు. ఇక షకీలా ,కత్తి మహేష్ మరికొందరు నటినటులు కూడా బాగా చేసారు.