రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవుతున్నప్పుడు ప్రతీ ఒక్కరికీ తమ సినిమాపై ధీమా ఉంటుంది. ఖచ్చితంగా తమ సినిమానే ఆడుతుందనే నమ్మకం పోటీ పడేలా చేస్తుంది. ఈ రోజు అదే పరిస్దితి ఎదురైంది. ఓ ప్రక్కన భారీ ఎత్తున సమంత నటించిన ఓ బేబి రిలీజ్ అయ్యింది. మరో ప్రక్క ఆది సాయి కుమార్ నటించిన ‘బుర్రకథ’ రిలీజ్ అయ్యింది. ఈ రెండింటికి పోటీ చెప్పాలంటే ఒకే రోజు రిలీజ్ అవటమే.
‘బుర్రకథ’చిత్రం ఓ మాదిరిగా ఫరవాలేదనిపించుకున్నా ..సమంత ఓ బేబి చిత్రం ముందు తేలిపోయింది. అందరూ ఆ సినిమా గురించే మాట్లాడటంతో బుర్ర కథ ని పట్టించుకునే వాళ్లే కరువు అయ్యారు. ఓ బేబి ఆ స్దాయి సక్సెస్ అవుతుందని ఊహించకపోవటమే ‘బుర్రకథ’ కు పెద్ద సమస్యగా మారింది. ఓ బేబి ఓ మాదిరిగా ఉన్నా సమంతకు ఉన్న ఫాలోయింగ్, అక్కినేని కుటుంబ ఫాలోయింగ్, ఆమెతో చేసిన మిగతా హీరోల పబ్లిసిటీ సినిమాకు ప్లస్ అవుతాయని ఊహించలేక పోటీ పడ్డారు. అదే ఇప్పుడు ‘బుర్రకథ’ని ఎవరి బుర్రలోనూ లేకుండా చేస్తోంది.
‘బుర్రకథ’లో స్టోరీ లైన్ ఏంటంటే…అభిరామ్(ఆది సాయికుమార్)కి పుట్టుకతోనే రెండు మెదళ్లు ఉండటంతో రెండు రకాలగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంతేకాక అభి, రామ్‌గా భిన్న వ్యక్తిత్వాలతో లైఫ్ గడిపేస్తూ ఉంటారు. ఒక్కరిగానే పుట్టినా.. ఇద్దరిలా పెరిగే వాళ్లిద్దరు ఎప్పటికి ఒకటయ్యారనేదే ఈ కథ.