సమంత అక్కినేని, నందినీ రెడ్డి కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ఓ బేబి
. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో సమంతతో పాటు సీనియర్ నటి లక్ష్మి కూడా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంపై సమంత చాలా హోప్స్ పెట్టుకుంది. కొరియన్ సినిమా మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీగా సాగుతుంది. ఈ సినిమా షోలు ఇప్పటికే చాలా చోట్ల ఇతర దేశాల్లో పడ్డాయి.
అక్కడ నుంచి అందుతున్న సమాచారం మేరకు … సినిమాలో సమంత ఫెరఫార్మెన్స్, ఫ్యామిలీలకు నచ్చే కథ, కాస్టింగ్, ఫస్టాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్, సెకండాఫ్ లో కొన్ని సెంటిమెంట్ ఎపిసోడ్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అయితే కథ మరీ సూపర్ ఫిషియల్ గా ఉండటం, సెకండాఫ్ లో కొన్ని బోరింగ్ మూమెంట్స్, ఫస్టాఫ్ సెటప్ కాస్త సాగతీసినట్లు ఉండటం, పాటల్లో ఛాంగు భళ తప్ప వర్కవుట్ కాకపోవటం సినిమాకు మైనస్ గా మారాయి. ఓవరాల్ గా సినిమా నవ్వుకుందామని వెళ్లేవారికి బాగానే నచ్చుతుందని అంటున్నారు.
ఇక ఈ చిత్రం స్టోరీ లైన్ విషయానికి వస్తే… డబ్బై ఏళ్ల బేబి(లక్ష్మి) పాతికేళ్ల యువతి(సమంత)గా మారితే అటుపై ఆమె జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? అన్నదే ఈ సినిమా కథ. అసలు లక్ష్మి .. సమంతగా ఎందుకు మారింది? అన్నది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. సమంతను ప్రేమించే కుర్రాడిగా (నాగశౌర్య) వల్ల పుట్టే ఫన్ రక్తి కట్టిస్తుంది. సినిమా మొత్తం సమంత చుట్టూ తిరిగే పాత్రలు ఆసక్తిని పెంచుతాయి. రాజేంద్ర ప్రసాద్ – లక్ష్మి .. రావు రమేష్ పాత్రలు ఎమోషన్ ని క్యారీ చేయడంలో సక్సెసయ్యాయి.
ఈ చిత్రంలో లక్ష్మి, రావు రమేష్, రాజేంద్రప్రసాద్, ప్రగతి రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రగతి కీలక పాత్రల్లో నటించారు. సాంకేతిక వర్గం: మ్యూజిక్: మిక్కి జె.మేయర్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్ , డైలాగ్స్: లక్ష్మీ భూపాల్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ, ప్రొడక్షన్ , డిజైన్:జయశ్రీ లక్ష్మీ నారాయణ, నిర్మాతలు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యువు థామస్ కిమ్ ,ఆర్ట్: విఠల్.కె, దర్శకత్వం: బి.వి.నందినీ రెడ్డి, నిర్మాణ సంస్థలు: సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్, సహ నిర్మాతలు: విజయ్ దొంకాడ, దివ్యా విజయ్.