మహిళా దర్శకురాలు నందినిరెడ్డి దర్శకత్వంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో రిలీజ్ అయిన చిత్రం ‘ఓ బేబీ’.ఈ చిత్రం మార్నింగ్ షో నుండే మంచి పాజిటివ్ టాక్ తో అంచనాలను దాటి ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూ ఓవరాల్ గా ఈ సినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.
ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఓ బేబీ ఫస్ట్ వీకెండ్ లోనే 17 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది. సమంత క్రేజ్.. సినిమా కొచ్చిన పాజిటివ్ టాక్, అలాగే సినిమాకు వచ్చిన రేటింగ్స్ అన్ని ఓ బేబీ ని కేవలం మూడు రోజులకే 17 కోట్లను కొల్లగొట్టే దిశగా నడిపించాయని చెప్తున్నారు.
అయితే 17 కోట్లు అనేది గొప్ప విషయం కాకపోయినా… ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ రావటం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఫస్ట్ వీకండ్ లో అదరకొట్టిన ఓ బేబీ మొదటి వారం ముగిసేసరికి నిర్మాతలకు ఏ రేంజ్ లాభాలు తెస్తుందో అని అందరూ అంచనాలు వేస్తున్నారు.
ఇక ఓ బేబీ కి పెట్టింది కేవలం 13 కోట్ల బడ్జెట్ మాత్రమే అని తెలుస్తోంది. అయితే అందులో థియేటర్స్ రైట్స్ కే 10 కోట్లకు పైగానే వచ్చేసాయి. ఇంకా శాటిలైట్, డిజిటల్ రైట్స్ కి అదనంగా వచ్చాయి.