టుడే రిలీజ్ : ‘7’, ‘హిప్పి’రిజల్ట్ ఏంటి?

మహేష్ బాబు ‘మహర్షి’తో కొన్ని రోజులు థియేటర్లు సందడి గా ఉన్నాయి. ఆ సినిమా తర్వాత థియోటర్లలో సరైన సినిమాలు పడక.. వచ్చినవి కూడా సరిగా ఆడక బాక్సాఫీస్ బావురుమంటోంది. ఈ వారం రిలీజైన సినిమాలు చూస్తూంటే..ఇప్పుడిప్పుడే పరిస్థితి మారే సూచనలు కూడా కనిపించడం లేదు.

ఈ రోజు రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే వీటిలో ఏదీ జనాల దృష్టిని ఆకర్షించ లేకపోయింది. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో ఓవర్ నైట్ ఫేమ్ సంపాదించిన కార్తికేయ.. ఆ సినిమా రిలీజైన ఏడాదిలోపే మరో సినిమాతో పలకరించాడు. అదే.. హిప్పి.

ఇంతకుముందు సూర్య హీరోగా ‘నువ్వు నేను ప్రేమ’ తీసిన టి.ఎన్.కృష్ణ దర్శకత్వంలో ‘కబాలి’ లాంటి భారీ చిత్రాలు తీసిన కలైపులి థాను ఈ సినిమాను నిర్మించాడు. అయితే ‘ఆర్ఎక్స్ 100’ తరహాలోనే అడల్ట్, రొమాంటిక్ అంశాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని కొంచెం కూడా ఆకర్షించలేకపోయింది. ప్రమోషన్లలో ఎంత హడావుడి చేసినా ఓపినింగ్స్ కూడా రప్పించుకోలేక లేకపోయింది.

దీంతో పాటుగా ‘7’ అనే థ్రిల్లర్ మూవీ కూడా రిలీజ్ అయ్యింది. హవీష్ లాంటి ఫేస్ వాల్యూ లేని హీరో నటించడంతో ఈ సినిమాకు ఓపినింగ్స్ అనేవి అసలు లేవు. హీరోయిన్ల గ్లామర్ మాత్రమే ప్రేక్షకుల దృష్టిని కొద్దిగా ఎట్రాక్ట్ చేయగలిగింది. ట్రైలర్ చూస్తే ఇది విభిన్నమైన సినిమాలాగే కనిపించింది. కానీ సినిమా ఏ మాత్రం ఆశాజనకంగా లేదు.

మరోవైపు ‘బిచ్చగాడు’తో వచ్చిన ఫేమ్ మొత్తం తర్వాతి సినిమాలతో పోగొట్టుకున్న తమిళ హీరో విజయ్ ఆంటోనీ ‘కిల్లర్’ సినిమాతో ఈ వారం పలకరిస్తున్నాడు. అర్జున్ ఇందులో కీలక పాత్ర చేయడం ఎట్రాక్షన్. దీని ప్రోమోలు కూడా బాగున్నప్పటికీ విజయ్ ఆంటోని గత సినిమాల ప్రభావం దీనిపై పడి ప్రేక్షకుల్లో ఇంట్రస్ట్ కలగట్లేదు. రేపు ఏమైనా ప్రేక్షకులు దయగలిగి థియేటర్లకు కదులుతారేమో చూడాలి.