‘భరత్ అనే నేను’ తరువాత.. మహేష్ బాబు చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం మహర్షి. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా ప్రారంభం రోజునే సినిమా రిలీజ్ ను ఏప్రిల్ 5 న అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అనుకోని అవాంతరాల వలన సినిమాను ఏప్రిల్ 25 కు పోస్ట్ ఫోన్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు.
An update about #Maharshi…
Shooting part will be completed by March 15th except for 2 songs. Post Production is going on simultaneously in full swing.
All set for April 25th Release.@urstrulyMahesh @directorvamshi@hegdepooja @allarinaresh @ThisIsDSP @kumohanan1 #SSMB25
— Sri Venkateswara Creations (@SVC_official) February 27, 2019
అయితే అప్పటికే దేశంతో పాటు ఆంధ్రాలో ఎన్నికల హడావుడి ఉండటంతో వంశీ పైడిపల్లి ఈసినిమాను ఆలస్యంగా చేస్తున్నాడనే కారణాలతో ఈ సినిమా జూన్‌కి వాయిదా పడిందని మీడియాలో వార్తలు వచ్చాయి. దాంతో మహేష్ ..వంశీ పైడిపల్లిపై సీరియస్ అయ్యినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్దితుల్లోనూ ఏప్రియల్ 25 న విడుదల చేయాలని అన్నారట. దాంతో అఫీషియల్ గా ఈ డేట్ ని ప్రకటించారు.
అయితే సినిమాలో రెండు పాటలు మినహా మిగిలిన షూటింగ్ మార్చి ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే ప్రకటించిన ఏప్రిల్ 25నే ఈ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారని నిర్మాతలు ప్రకటించారు.
దిల్ రాజు, సి అశ్విని దత్, పివిపి సినిమా కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు 25 వ సినిమాగా వస్తున్న మహర్షిలో మహేష్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. వంశి పైడిపల్లి దర్శకుడు.