విక్రమ్ ‘మిస్టర్ కేకే’ బిజినెస్..ఎంత దారుణం అంటే
ఒకప్పుడు తమిళ హీరో విక్రమ్ సినిమాలకు తమిళంలో కన్నా ఇక్కడ తెలుగులోనే ఎక్కువ బిజినెస్ జరిగేది. అయితే వరస ఫెయిల్యూర్స్ తో గత మూడు సంవత్సరాలుగా ఒక్క హిట్ కొట్టకపోవటంతో ఆ పరిస్దితి తల క్రిందులైంది. తమిళంలో కొద్దో గొప్పో క్రేజ్ వస్తున్నా..తెలుగులో మాత్రం పట్టించుకునే నాధుడే కరువు అయ్యారు. చూస్తూండగానే విక్రమ్ మార్కెట్ పూర్తిగా హారతి కర్పూరంలగా కరిగిపోయింది. ఆ ప్రభావం ఈ రోజు రిలీజ్ అవుతున్న ఆయన తాజా చిత్రం మిస్టర్ కేకే పై పడింది.
అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని తెలుగులో అమ్ముదామని ఎంత ప్రయత్నం చేసినా కొని రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ కరువు అయ్యారు. దాంతో నిర్మాత స్వయంగా థియోటర్స్ మాట్లాడుకుని రిలీజ్ చేస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సినిమాకు హిట్ టాక్ వస్తే అప్పుడు పరిస్దితి మారుతుందని ఎదురుచూస్తున్నారు. మరో ప్రక్క ఇదే రోజు రిలీజ్ అవుతున్న అమలాపాల్ ఆమెకు …బోల్డ్ యాక్ట్ వల్ల మంచి క్రేజ్ వచ్చి హాట్ హాట్ గా బిజినెస్ జరిగిపోవటం విశేషం.
సినిమా వివరాల్లోకి వెళితే.. విక్రమ్ హీరోగా రూపొందిన సినిమా ‘మిస్టర్ కేకే’. అక్షరహసన్, అభిహసన్ కీలక పాత్రల్లో నటించారు. రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం. తమిళంలో రాజ్‌కమల్ ఫిల్మ్ ఇంటర్‌నేషనల్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ కె.రవిచంద్రన్ బ్యానర్‌పై ‘కదరమ్ కొండన్’ పేరుతో రూపొందింది. ఈ చిత్రాన్ని తెలుగులో టి.నరేష్ కుమార్, టి.శ్రీధర్ సంయుక్తంగా ‘మిస్టర్ కేకే’ పేరుతో విడుదల చేస్తున్నారు. పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా థ్రిల్‌ని అందించే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు.