ప్రముఖ దర్శకుడు మణిరత్నం గత కొంత కాలంగా వరస డిజాస్టర్స్ అందిస్తూ వచ్చారు. వచ్చిన సినిమా వారం కూడా ఆడకుండా వెళ్లిపోతూ వస్తోంది. ఓకే బంగారం సినిమా కూడా టాక్ బాగున్నా సోసో గా ఆడింది. దాంతో ఆయన తాజా చిత్రం నవాబ్ పై తెలుగులో పెద్దగా అంచనాలు లేవు. పబ్లిసిటీ కూడా పెద్దగా లేదు. తెలుసున్న ఫేస్ లు పోస్టర్ పై కనపడకపోవటంతో హైదరాబాద్ లో తప్పించి మిగతా చోట్ల చెప్పుకోదగ్గ ఓపినింగ్స్ లేవు. ఈ నేపధ్యంలో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. మణి సార్ ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో జనం ఈ సినిమాని భుజాన ఎత్తుకుంటున్నారు.
టాక్ బాగుంది. మరి కలెక్షన్స్ ఏమన్నా పికప్ అయ్యాయా అంటే తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ జస్ట్ ఓకే అన్నట్లు ఉంది పరిస్దితి. బి,సి సెంటర్లలో అయితే మరీ దారుణంగా ఉంది. కేవలం పై వరసలు మాత్రమే ఫిల్ అవుతున్నాయి. క్లాస్ సినిమాగా టాక్ స్ప్రెడ్ అయ్యింది. అయితే అమెరికాలో మాత్రం ఈ సినిమా బాగా వర్కవుట్ అవుతోంది. బుధవారం నిర్వహించిన ప్రీమియర్స్‌లో 79,258 డాలర్లు, గురువారం (తొలిరోజు) 87,970 డాలర్లు, మొత్తం 167,228 డాలర్లు (రూ.1.21 కోట్లు) రాబట్టిందని తెలిపారు. ఒక్క రోజులో ఇంత మంచి కలెక్షన్స్ రాబట్టడం గ్రేటే మరి. ఈ వీకెండ్ కూడా వర్కవుట్ అవుతుంది.
ఇక తమిళనాడులో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజున ఈ సినిమా ఎనిమిది కోట్ల రూపాయల వసూళ్లను సాధించిందని తమిళ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఒక్క చెన్నైలోనే ఎనభై లక్షల రూపాయల వసూళ్లు దక్కాయని చెప్తున్నారు.