నాని, శ్రద్ధ శ్రీనాథ్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’. క్రికెట్ నేపథ్యంగా తెరకెక్కిన ఈ ఎమోషనల్ డ్రామాకు మొదటి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విమర్శకులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే టాక్ కు భిన్నంగా కలెక్షన్స్ ఉన్నాయి. సూపర్ హిట్ టాక్ తో రికార్డు కలెక్షన్స్ ను వసూలు చేస్తోంది అనుకున్న వారికి నిరాశే ఎదురౌతోంది. కేవలం ఏ సెంటర్లలో మాత్రమే మంచి రన్ ను కనబరుస్తుంది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేలా కనిపించడం లేదు. సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా వసూళ్ల విషయంలో డల్ అవ్వడంతో ట్రేడ్ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.
ఇక ‘జెర్సీ’ సినిమా అమెరికా బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లు రాబడుతోంది. మంచి అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం అక్కడ 10 రోజుల్లో 1.23 మిలియన్ డాలర్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం నాని కెరీర్ లో సెకండ్ బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. మొదటి స్థానంలో ‘భలే భలే మగాడివోయ్’ 1.43 మిలియన్ డాలర్ల వసూళ్లతో ఉంది. అయితే ఫుల్ రన్ లో ఈ చిత్రం ‘భలే భలే మగాడివోయ్’ వసూళ్లని క్రాస్ చేయడం కష్టమే అనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ చిత్రం‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ నుండి తీవ్రమైన పోటీ ఎదురవుతుంది. అక్కడ ఎక్కడ చూసినా ఈ సినిమా నే ధియోటర్స్ లో కనపడుతోంది. చాలా స్క్రీన్స్ లో ‘జెర్సీ’ సినిమా తీసేసి ‘అవెంజర్స్ ఎండ్ గేమ్’ వేశారు. దాంతో ‘జెర్సీ’కలెక్షన్స్ పై దాని ఇంపాక్ట్ చూపించింది.
‘జెర్సీ’ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మించింది. అనిరుధ్ బాణీలు అందించారు. ఇందులో నాని ‘అర్జున్’ అనే క్రికెటర్‌గా కనిపించి అందరి ప్రశంసలు పొందారు.