నాని ‘జెర్సీ’ విడుదల తేదీ ఖరారు !

నాని తాజా చిత్రంగా ‘జెర్సీ’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా చాలా భాగం షూటింగు పూర్తి చేసుకుంది. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నాని డిఫరెంట్ గా కనిపించనున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు.

ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను తన ట్విట్టర్ ద్వారా నాని రిలీజ్ చేశాడు. ఓ బ్యాట్‌పై జెర్సీ అనే టైటిల్‌తో పాటు రిలీజ్‌ డేట్‌ (ఏప్రిల్‌ 19)ను ఫిక్స్‌ చేశారు. ‘యూ టర్న్‌’ భామ శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తుండగా.. గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమా కోసం నాని కొంతకాలం పాటు క్రికెట్ ఆటలో శిక్షణ తీసుకుని మరీ రంగంలోకి దిగాడు. ఈ సినిమా తన కెరియర్లో వైవిధ్యభరితమైనదిగా నిలుస్తుందని నాని బలంగా నమ్ముతున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.