‘సవ్యసాచి’టాక్: ప్లస్ లు ఏంటి..మైనస్ లు ఏంటి?

నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎర్నేని నవీన్, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మించిన చిత్రం ‘సవ్యసాచి’. నిధి అగర్వాల్‌ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అవుతోంది.ఇప్పటికే యుఎస్ లో షోలు పడ్డాయి. అక్కడ టాక్ ఏంటో చూద్దాం.

సేమ్‌ వపర్‌. రైట్‌ హ్యాండ్‌కి ఎంత పవర్‌ ఉందో.. సేమ్‌ పవర్‌ లెఫ్ట్‌ హ్యాండ్‌కి కూడా ఉందనే పాయింట్ చుట్టూ తిరిగే ఈ సినిమాలో …. మరి ఈ ఎక్స్‌ట్రా పవర్‌తో అతను ఎక్స్‌ట్రీమ్‌గా ఏం చేశాడనేది ‘సవ్యసాచి’ సినిమా స్టోరీలైన్.

ఈ చిత్రం ఫస్టాఫ్ ..పెద్దగా ఇంప్రెస్ చేసే విధంగా లేదు. కేవలం నోవల్టీ పాయింట్ అయిన లెప్ట్ హ్యాండ్ సిండ్రమ్ చుట్టూ సీన్స్ ని అల్లారు అయితే దాన్ని అంతగా యుటిలైజ్ చేసుకోలేదని అంటున్నారు. లవ్ ట్రాక్, కామెడీ,సాంగ్స్ ఓకే. ఇంటర్వెల్ కు మాధవన్ ఎంట్రీ ఇచ్చాక కథ కాస్త వేడెక్కుతుంది. అప్పటివరకూ అలా అలా వెళ్లిపోయింది. ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ అక్కడక్కడా ఎంగేజ్ చేస్తూ వెళ్లింది. చైతూ, మాధవన్ ఇద్దరూ పోటీ పడి మరీ కొన్ని సీన్స్ చేసారు. వాళ్లిద్దరి మధ్యా కాంప్లిక్ట్ పాయింట్ బాగుంది.

అయితే అందుకోసం ఎన్నుకున్న బ్యాక్ డ్రాప్, కాలేజీ సీన్స్ అంత ఇంప్రెసివ్ గా లేవు. ఇద్దరి మధ్యా నడిచే మైండ్ గేమ్ సోసోగా ఉంది. అయితే ప్రీ క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా స్టోరీ ఇంట్రస్టింగ్ గా ఉన్నా నేరేషన్ డల్ గా ఉంది. మాస్ లోకి వెళ్లాలనే నాగచైతన్య ప్రయత్నం ఎంతవరకూ నెరవేరుతుందో చూడాలి. రావు రమేశ్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేశ్‌ తదితరులు నటించిన ఈ సినిమాకు కెమెరా: యువరాజ్‌.