వీడియో: వైఎస్ `యాత్ర` కోసం మ‌మ్మూట్టి డ‌బ్బింగ్ మేకింగ్‌

దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి జీవితంపై రూపొందిన సినిమా `యాత్ర‌`. మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్మూట్టి ఇందులో వైఎస్‌గా న‌టించారు. ఈ సినిమా కోసం మ‌మ్మూట్టి సొంతంగా డ‌బ్బింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను చిత్రం యూనిట్ శ‌నివారం ఉద‌యం విడుద‌ల చేసింది. ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర ఘ‌ట్టాన్ని ప్ర‌ధానాంశంగా చేసుకుని యాత్ర సినిమాను రూపొందించారు. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఈ చిత్రం నిర్మిత‌మైంది. మ‌హీ వీ రాఘ‌వ్ ద‌ర్శ‌కుడు. విజ‌య్‌చిల్లా, శ‌శి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Mammootty Dubbing Making | The Voice of Yatra | YSR Biopic | Mahi V Raghav | 70MM Entertainments