‘మహర్షి’ అమెజాన్ ప్రైమ్ రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’భాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. టాక్ డివైడ్ గా ఉన్న కలెక్షన్స్ లో మాత్రం కుమ్మేసేంది. అయితే థియోటర్ లలో చూసినా మరోసారి తమ ఇంట్లో చూద్దామనుకునేవాళ్లు, ఫ్యామిలీతో ఈ సినిమాకు వెళ్లలేకపోయినవాళ్లు అమెజాన్ ప్రైమ్ లో ఎప్పుడు రిలీజ్ అవుతుందా చూద్దామని ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం జూలై 3 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా తమ అభిమాన చిత్రాన్ని మరోసారి స్మాల్ స్క్రీన్ పై చూడాలని ఉత్సాహం చూపిస్తున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా 50 రోజుల వేడుకను గ్రాండ్ గా నిర్వహించాలని యూనిట్ చూస్తోంది. ఈనెల 28 వ తేదీన శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు మహర్షి సినిమా యూనిట్ అందరూ పాల్గొనబోతున్నట్టు వినికిడి. వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన ప్రముఖులు స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారట.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం ‘ఎఫ్ 2’ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ రికార్డును అధిగమించి 2019లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది.