‘మహర్షి’:తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ !

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. రిలీజ్ పది రోజులు అవుతున్న ‘మాహర్షి’ కలెక్షన్స్ మాత్రం చాలా ఏరియాల్లో స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికే నైజాంలో మహర్షి బ్రేక్ ఈవెన్ అయి మూడున్నర కోట్లకు పైగానే లాభాలను గడించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం కొన్ని చోట్ల నాన్ బాహుబలి రికార్డు ను కూడా బ్రేక్ చేసింది. రీసెంట్ గా ‘మహర్షి’ విజయోత్సవ వేడుకను చిత్ర యూనిట్ నిన్న విజయవాడలోని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో మహర్షి పది రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఏరియాల వారిగా పది రోజుల కలెక్షన్స్ వివరాలు..

నైజాం – 23.50 కోట్లు
సీడెడ్ – 8.09 కోట్లు
గుంటూరు – 7.05 కోట్లు
తూర్పు గోదావరి – 6.01 కోట్లు
పశ్చిమ గోదావరి – 4.74 కోట్లు
కృష్ణా – 4.63 కోట్లు
నెల్లూరు – 2.28 కోట్లు
ఉత్తరాంధ్ర – 8.52 కోట్లు

తెలంగాణ & ఏపీలో ‘మహర్షి’ టెన్ డేస్ కలెక్షన్ల షేర్ : రూ. 64.82 కోట్లు.

మహేష్ బాబు 25వ సినిమాగా ‘మహర్షి’ రూపొందింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. మెసేజ్ ఓరియెంటెడ్ కథగా వచ్చిన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ లభించింది. మహేశ్‌ నటన, కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ని ప్రముఖులతోపాటు నెటిజన్లు ప్రశంసించారు.