‘మహర్షి’:యుఎస్ డిస్ట్రిబ్యూటర్ కు అంత నష్టమా?

మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’టాక్ మొదటి రోజు నుంచీ తేడాగానే ఉంది. కొంతమంది అద్బుతం అంటూంటే మరికొంతమంది అంత సీన్ లేదని కొట్టిపారేస్తున్నారు. దాంతో అసలు మహర్షి హిట్టా లేదా రిజల్ట్ ఏమిటి అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. చిత్ర యూనిట్ విపరీతమైన ప్రమోషన్స్ చేస్తూ పోస్టర్ల మీద అదిరిపోయే స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది. ఈ సినిమాను ‘ఎపిక్ బ్లాక్ బస్టర్‌’గా ఇప్పటికే పేర్కొంది. మహేష్ బాబు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ల వసూళ్లను ‘మహర్షి’ వారంలోనే దాటేసిందని చెప్తోంది. కానీ దిల్ రాజు సొంతంగా రిలీజ్ చేసుకున్న నైజాం ఏరియాలో తప్ప ఇంకెక్కడా వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపధ్యంలో ఓవర్ సీస్ కలెక్షన్స్ మరీ ముఖ్యంగా యుఎస్ భాక్సాఫీస్ పరిస్దితి ఏమిటనేది చర్చగా మారింది. యుఎస్, సీడెడ్ లాంటి ఏరియాల్లో ‘మహర్షి’మీద పెట్టిన పెట్టుబడిలో సగమే రాబట్టింది. ఇప్పుటి దాకా వసూలైందో ఇంకా అంత వసూలైతే తప్ప బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రాని పరిస్దితిట. ఓవ‌ర్సీస్‌లో ఈ చిత్రం సేఫ్ కావాలంటే దాదాపు 3.5 మిలియ‌న్ రావాలి.

కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది మాత్రం 1.7 మిలియ‌న్ మాత్ర‌మే. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ చిత్రం అంత వ‌సూలు చేయ‌డం అసాధ్య‌మే. దాంతో రెండు కోట్లు వరకూ యుఎస్ లో నష్టపోతారని అంచనా. మహా అయితే యుఎస్ లో $1.8 మిలియన్ మార్క్ ని చేరుతుందని లెక్కలేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకు మంచి ఓపినింగ్స్ రాకపోవటం మైనస్ గా మిగిలింది. ఫస్ట్ వీకెండ్ లో ఓకే అనిపించుకున్నా తర్వాత ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేయలేక చతికిలపడింది.

దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ నిర్మాణంలో భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించగా హీరోయిన్ గా పూజా హెగ్దే తన అందాలను ఆరబోసింది. జగపతిబాబు విలన్‌గా మరోసారి అదరకొట్టారు. తన కామెడీతో ఎప్పుడు ప్రేక్షకులను నవ్వించే అల్లరి నరేష్ ఈ చిత్రంలో సీరియస్ క్యారెక్టర్ చేసి ఆకట్టుకున్నారు.