‘మహర్షి’ హవా రెండో రోజు కంటిన్యూ అయ్యిందా?

ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. గురువారం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తున్నట్లు సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.

భారీ అంచనాలు మధ్య సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా రూపొందిన ‘మహర్షి’నిన్న గురువారం రిలీజైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ రావటంతో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది.మొదటి రోజున ఈ చిత్రం నైజాంలో రూ.6.38 కోట్లు, యూఏలో రూ2.88 కోట్లు, సీడెడ్‌లో రూ.2.89 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.3.2 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ.2.47 కోట్లు, కృష్ణలో రూ.1.39 కోట్లు, గుంటూరులో రూ.4.4 కోట్లు, నెల్లూరులో రూ.1 కోటి .. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో కలిపి రూ.24.6 కోట్లు (షేర్‌) రాబట్టినట్లు తెలుస్తోంది. రెండో రోజు కూడా కలెక్షన్స్ జోరు కొనసాగిందని వినికిడి.

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్వినీదత్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. మహేష్ నటన, కథ, వంశీ టేకింగ్‌ అద్భుతంగా ఉన్నాయని చిత్ర యూనిట్ అందరి నుంచీ ప్రశంసలు అందుతున్నాయి.