‘మహర్షి’:ఎంతకు కొన్నారు,ఎంత వచ్చింది?

సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం ‘మహర్షి’. టాక్ కు భిన్నంగా తెలుగు రాష్ట్రాల్లో స్టడీగా కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.ముఖ్యంగా మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ నటనకు ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్‌లు ఈ సినిమాను అత్యంత భారీ హంగులతో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ బెస్ట్ ఫిగర్స్ నే నమోదు చేసింది.

ఏరియా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్

నైజాం 16.61 కోట్లు
ఈస్ట్ గోదావరి 4.86 కోట్లు
వెస్ట్ గోదావరి 5.70 కోట్లు
ఉత్తరాంధ్ర 5.55 కోట్లు
కృష్ణా 3.62 కోట్లు
గుంటూరు 5.90 కోట్లు
నెల్లూరు 1.71 కోట్లు
సీడెడ్ 5.60 కోట్లు
ఆంధ్రా/తెలంగాణా 47.58 కోట్లు

ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 72.10 కోట్లకు అమ్మారు. ఇప్పటికే దాదాపు 50 కోట్ల మార్క్ కు రీచ్ అవటంతో…బ్రేక్ ఈవెన్ ఈ వారంలోనే వచ్చేస్తుందని భావిస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ రోజు కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దానిపై టోటల్ ఎంత వరకూ వెళ్లచ్చు అనేది అంచనా వేస్తారు.