క్రాక్ కలెక్షన్స్ ఎంతంటే..?

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చాలా రోజుల తరువాత ఒక స్పెషల్ సందడి నెలకొంది. ఈ రోజు కోసమే చాలా రోజుల నుంచి ఎంతో మంది నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 నెలల నుంచి మాస్ సినిమాను మిస్సయిన ఆడియెన్స్ కు మాస్ రాజా క్రాక్ తో ఫుల్ బిర్యానీ లాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నట్లు చెప్పవచ్చు. ఇక సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది హాట్ టాపిక్ గా మారింది.

శనివారం మార్నింగ్ షోలు గ్రాండ్ గా మొదలవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు కొంత నిరాశను కలిగించినప్పటికి ఫస్ట్ షో నుంచి మొదలైన క్రాక్ హవా అలానే కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు రెండు షోలకు వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే మొదటిరోజు కలెక్షన్స్ షేర్స్ 1కోటి దాటినట్లు తెలుస్తోంది. ఒక విధంగా 50% ఆక్యుపెన్సీతో ఈ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి అంటే బిగ్ వండర్ అని చెప్పవచ్చు.

ఒకవేల మొదటి రెండు షోలు అలాగే హౌజ్ ఫుల్ గా థియేటర్స్ నడిచి ఉంటే కలెక్షన్స్ హవా గట్టిగానే ఉండేదని అనిపిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఫుల్ హాలిడేస్ కాబట్టి ఈ కమర్షియల్ మూవీకి అన్ని వర్గాల ఆడియెన్స్ నుంచి సపోర్ట్ దక్కే ఛాన్స్ లేకపోలేదు. ఇలానే కొనసాగితే వారం రోజుల్లో మాస్ రాజా ప్రాఫిట్ జోన్ లోకి రప్పించగలడు. మరి క్రాక్ మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో  కలెక్షన్స్ ను రాబడుతుందో చూడాలి.