ఆ మూవీ టీజ‌ర్‌కు పూరీ జ‌గ‌న్నాథ్‌, స‌ల్మాన్‌ఖాన్ ఫిదా

సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని విడుద‌లైన ఓ టీజ‌ర్ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌, బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్‌ఖాన్‌ ఫిదా అయిపోయారు. టీజ‌ర్ చూసిన వెంట‌నే ఆ సినిమా హీరోకు కంగ్రాట్స్ చెప్ప‌కుండా ఉండ‌లేక‌పోయారు. సోష‌ల్ మీడియా ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆ సినిమా `పైల్వాన్‌`. క‌న్న‌డ సినిమా. ఈగ ఫేమ్ సుదీప్ హీరోగా న‌టించారు.

ఈ సినిమా టీజ‌ర్‌ను మంగ‌ళ‌వారం బెంగ‌ళూరులో యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. విడుద‌ల చేసిన కొద్ది సేప‌ట్లోనే 10 ల‌క్ష‌ల మంది అభిమానులు దీన్ని చూశారు. స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా రాబోతున్న పైల్వాన్ సినిమాకు కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆర్ఆర్ఆర్ మోష‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై స్వ‌ప్న కృష్ణ దీన్ని నిర్మించారు. అర్జున్ జ‌న్య సంగీతం.

https://twitter.com/purijagan/status/1085134756361121792