నాని ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిటేల్స్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళి రావాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం జెర్సి. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ లోగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడమే కాకుండా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలనున్నారు. 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

ఇక ఈ మూవీ క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోంది. కథ ప్రకారం 80-90 దశకం మధ్య జరిగిన కథ ఇది. 36 ఏళ్ళ వయసులో కొత్తగా ఏమీ చేయడానికి లేని ఒక యువకుడు 1996-97 రంజీ ట్రోఫీ ద్వారా ప్రూవ్ చేసుకుని తానేంటో మళ్ళి ప్రపంచానికి చాటాడమే కీలకాంశం. జెర్సిలో నాని పాత్ర పేరు అర్జున్ . అప్పట్లో సంచలన స్టార్ గా పేరున్న రమణ్ లాంబా జీవత కథగా ఈ సినిమా రూపొందుతోందని టాక్.

ఇంతవరకూ చేయని పాత్రలో నాని కనిపించనున్నాడు. కథాకథనాలు .. పాత్రలను మలిచిన తీరు .. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలవనున్నాయని అంటున్నారు. ఇది నాని కెరియర్లో చెప్పుకోదగిన చిత్రమవుతుందేమో చూడాలి.