మాస్, యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ డైరక్టర్ బోయపాటి శ్రీను. ‘భద్ర’ నుంచి ‘జయ జానకి నాయక’ వరకూ ఆయన కథల్లో తెలుగు సినిమా ఊహించనంత హీరోయిజం కనిపిస్తుంటుంది. హీరోని ఇష్టపడి, వారి అభిమానుల్లో ఓ అభిమానిగా మారిపోయి సినిమాలు తీస్తుంటారాయన. అందుకే అవన్నీ కమర్షియల్ పరంగా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాల్ని అందుకుంటాయి. అదే ఫంధాలో రామ్‌చరణ్‌ని ‘వినయ విధేయ రామ’గా చూపించారు. ఈ సినిమాకు 72 కోట్లు బడ్జెట్ పెట్టారు. దాంతో వంద కోట్లు వరకూ వసూలు చేస్తుందని అంచనా వేసారు.
అలాగే ఈ సినిమా విడుదల కాకముందు అంచనాలు భారీగా ఉన్నాయి. దాంతో సినిమా ఏకంగా వంద కోట్ల బిజినెస్ చేసింది. రంగస్థలం స్థాయిలో బిజినెస్ చేయడం తో నిర్మాతలు లాభాల్లో పడ్డారు. అయితే బోయపాటి మాస్ హీరోగా చెర్రీ చూపించిన విధానం నవ్వులు పాలు చేసింది. సాఫ్ట్ టైటిల్‌తో వచ్చిన ఈ మాస్ సినిమాలో చాలా సన్నివేశాలకు నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఊహించని విధంగా సినిమా 40 కోట్ల వద్ద ఆగిపోయింది. సినిమా కొనుగోలు చేసిన డిస్టిబ్యూటర్లు తీవ్రంగా నష్టపోతున్నారని సమాచారం. ఇప్పుడు నిర్మాత దానయ్య ఏ విధంగా ఆ నష్ట పరిహారం ఇచ్చి సెటిల్ చేసుకోవాలనే విషయమై చర్చలు జరుపుతున్నాయని సమాచారం
ఇక దిల్ రాజు మరియు యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా రైట్స్ లో ఎక్కువ భాగం కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటివరకూ తేలిన లెక్కలు ప్రకారం నైజాం ఏరియాలో ఈ సినిమా దాదాపుగా 10 కోట్ల వరకు నష్టాలను మిగల్చడం ఖాయంగా కనిపిస్తుంది. అయితే దిల్ రాజుకు కొంతలో కొంత ఊరట. వినయ విధేయ రామ సినిమా వల్ల వచ్చిన నష్టాలు ఎఫ్ 2 సినిమా ద్వారా రికవరీ అవుతున్నాయి. మిగతా డిష్టిబ్యూటర్ లకు దానయ్య ఏమైనా సాయం చేస్తాడేమో చూడాలి.