ఫ్ల‌యింగ్ కిక్‌:ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా? మ‌న‌కు తెలిసిన ఫేసే!

ఈ ఫొటోలో ఉన్న‌ది ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా? మ‌న‌కు తెలిసిన ముఖ‌మే. ఒకే ఒక్క మూవీలో త‌ళుక్కున మెరిసింది. బాలీవుడ్‌లో మాత్రం టాప్ రేంజ్‌లో కొన‌సాగుతోంది. ఆమె- దిశా ప‌టాని. వ‌రుణ్ తేజ్ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `లోఫ‌ర్‌`లో న‌టించింది దిశా. తెలుగులో హిట్ కొట్టిన క్ష‌ణం మూవీ బాలీవుడ్ రీమేక్ బాఘీ – 2లో కూడా ఆమే హీరోయిన్‌.

ఇప్పుడు ఫ్ల‌యింగ్ కిక్ ఇస్తూ ఫొటోకు పోజు ఇచ్చింది. దీనికీ ఓ కార‌ణం ఉందండోయ్‌. బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ `భార‌త్‌`. ఇందులో క‌త్రినా కైఫ్‌తో పాటు దిశా ప‌టాని కూడా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీ ఫుల్లీ యాక్ష‌న్ ప్యాక్డ్‌. హీరోయిన్ల‌పై కూడా స్టంట్ సీన్లు ఉంటాయ‌ట‌. అందుకే- దిశా ఇంటి ప‌ట్టున ఉంటూ, ఇలా క‌స‌ర‌త్తు చేస్తోంది.